Begin typing your search above and press return to search.

సమంత మోస్ట్ అవైటెడ్ మూవీ శాకుంతలం వాయిదా, సమంత వల్లేనా!

By:  Tupaki Desk   |   7 Feb 2023 1:00 PM GMT
సమంత మోస్ట్ అవైటెడ్ మూవీ శాకుంతలం వాయిదా, సమంత వల్లేనా!
X
సమంత ప్రధాన పాత్రలో గుణ శేఖర్ దర్శకత్వంలో వస్తున్న మూవీ శాకుంతలం. ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. కాళిదాసు రచించిన అభిజ్ఞాన శాకుంతలం ఆధారంగా గుణశేఖర్ తన సొంత బ్యానర్ లో ఈ సినిమాను నిర్మించారు. నిర్మాణ భాగస్వామిగా దిల్ రాజు ఉన్నారు. ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఈ మూవీ ఫిబ్రవరి 17 న రిలీజ్ చేయనున్నట్లు మూవీ టీం ఇప్పటికే ప్రకటించింది. శాకుంతలం మూవీ నుండి సాంగ్, ట్రైలర్ విడుదలై అందరినీ ఆకట్టుకున్నాయి. అయితే ఇక సినిమా వచ్చేస్తోంది అనుకుంటుండగానే మూవీ టీం నుండి నిరాశ పరిచే అప్ డేట్ వచ్చింది.

ఫిబ్రవరి 17వ తేదీన శాకుంతలం మూవీ రిలీజ్ కావాల్సి ఉండగా, ఆ రోజున సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురాలేక పోతున్నామని చిత్ర బృందం అధికారిక ప్రకటన విడుదల చేసింది. త్వరలోనే కొత్త రిలీజ్ డేట్ తో వచ్చేస్తామని ప్రకటించింది మూవీ టీం. శాకుంతలం మూవీ వాయిదా పడటం ఇది రెండో సారి. గతేడాదే ఈ సినిమా రిలీజ్ కావాల్సి ఉండగా సాంకేతిక కారణాల వల్ల పోస్ట్ పోన్ చేశారు. ఇప్పుడు మరోసారి వాయిదా వేశారు.

శాకుంతలం సినిమా రిలీజ్ చేయకపోవడానికి సమంతే కారణమని, అందుకే వాయిదా వేశారన్న వార్తలు వినిపిస్తున్నాయి. సమంత ఆటో ఇమ్యూన్ వ్యాధితో బాధపడుతున్న సంగతి తెలిసిందే. బెడ్ పై ఉండే యశోధకు డబ్ చెప్పింది సమంత. అనారోగ్య సమస్యలు ఉన్నా కూడా శాకుంతలం మూవీ ప్రమోషన్స్ లో పాల్గొంటానని సమంత చెప్పిందట, కానీ గుణశేఖర్ మాత్రం సినిమాను వాయిదా వేసేందుకు మొగ్గు చూపినట్లు తెలుస్తోంది.

అసలు కారణం మాత్రం వేరే ఉందని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. అద్భుతమైన విజువల్ ఎఫెక్ట్స్ తో శాకుంతలం మూవీని తెరకెక్కిస్తున్నారు. ఈ విజువల్ వండర్ మూవీకి సంబంధించి పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ ఇంకా మిగిలి ఉందట. ఆలస్యంగా వచ్చినా పర్లేదు కానీ మంచి గ్రాఫిక్స్ చూపించాలనే గుణ శేఖర్ వాయిదా వేసినట్లు తెలుస్తోంది. శాకుంతలం మూవీని తెలుగుతో పాటు కన్నడ, మలయాళం, తమిళంతో పాటు హిందీలో కూడా విడుదల చేయనున్నారు. మైథాలజికల్ మూవీస్ కు నార్త్ లో మంచి ఆదరణ ఉండటంతో దానిని దక్కించుకోవాలని మరికొంత ఎఫర్ట్ పెడుతున్నట్లు సమాచారం.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.