Begin typing your search above and press return to search.

క్యాన్సర్ తో పోరాడి.. కన్నుమూసిన ప్రముఖ నటి..!

By:  Tupaki Desk   |   6 Dec 2022 8:56 AM GMT
క్యాన్సర్ తో పోరాడి.. కన్నుమూసిన ప్రముఖ నటి..!
X
ప్రముఖ హాలీవుడ్ నటి కిర్ స్ట్రీ అల్లీ(71) కొంత కాలంగా క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్నారు. వైద్యుల సహాయంతో క్యాన్సర్ పై అలుపెరగని పోరాటం చేస్తున్న కిర్ స్ట్రీ అల్లీ తాజాగా చివరిశ్వాస విడిచారని ఆమె కుమారుడు విలియం ట్రూ స్టీవెన్సన్ సోషల్ మీడియా వేదికగా అభిమానులకు తెలియజేశాడు.

ఆమె మృతితో హాలీవుడ్లో విషాద ఛాయలు నెలకొన్నాయి. అభిమానులు.. సినీ.. రాజకీయ ప్రముఖులు కిర్ స్ట్రీ మృతిపై సంతాపం తెలుపుతూ ఆమె కుటుంబ సభ్యులను ఓదార్చే ప్రయత్నం చేస్తున్నారు. తన తల్లి మరణంపై విలియం ట్రూ స్టీవెన్సన్ భావోద్వేగం చెందుతూ సోషల్ మీడియాలో ఒక ట్వీట్ చేయగా అది కాస్తా వైరల్ గా మారింది.

కిర్ స్ట్రీ అల్లీ క్యాన్సర్ పై అలుపెరగని పోరాటం చేశారని.. ఆమె స్ఫూర్తి అందరికీ ఆదర్శమని తెలిపాడు. కిర్ స్ట్రీ తమకు అంతులేని విషాదం.. ముందుకు సాగే జ్ఞాపకాలు.. సాహసాలను అందించి వెళ్లిపోయిందని ఆవేదన వ్యక్తం చేశాడు.

తన తల్లి క్యాన్సర్ పై పోరాటం చేయడంలో సహకరించిన మోఫిట్ క్యాన్సర్ సెంటర్ లోని వైద్యులు.. సిబ్బందికి విలియం ట్రూ స్టీవెన్సన్ కృతజ్ఞతలు తెలిపారు.

కాగా కిర్ స్ట్రీ అల్లీ హాలీవుడ్ పలు ప్రతిష్టాత్మక సినిమాల్లో నటించారు. ''డ్రాప్ డెడ్ గార్జియస్''.. ''వెరోనికాస్ క్లోసెట్''.. ''ఇట్ టేక్స్ టూ'' వంటి సినిమాల్లో ఉత్తమ నటనను కిర్ స్ట్రీ అల్లీ కనబర్చి కోట్లాది మంది అభిమానులు సంపాదించుకున్నారు. 1970లో బాబ్ అలీ అనే వ్యక్తిని పెళ్లాడిన కిర్ స్ట్రీ ఏడేళ్లకే విడాకులు తీసుకుంది.

అనంతరం పార్కర్ స్టీవెన్ సన్ ను రెండో వివాహం చేసుకుంది. వీరిద్దరి ముగ్గురు సంతానం. కిర్ స్ట్రీ అల్లీ తన సినీ కెరీర్లో 76 యాక్టింగ్ క్రెడిట్ లను దక్కించుకోవడం విశేషం. ఇదిలా ఉంటే కిర్ స్ట్రీ అల్లీని చివరి చూపు చూసేందుకు అభిమానులు వేలాదిగా తరలి వస్తున్నారు. దీంతో ఆమె కుటుంబ సభ్యులు అభిమానుల సౌకర్యార్థం అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.