'ఫ్యామిలీ డ్రామా' ట్రైలర్: సైకో కిల్లర్ గా మారిన సుహాష్..!

Thu Jul 22 2021 10:46:21 GMT+0530 (IST)

'Family Drama' Trailer: Suhash Turns Into A Psycho Killer ..!

'కలర్ ఫొటో' చిత్రంతో హీరోగా మారిన హాస్యనటుడు సుహాష్.. ఫస్ట్ సినిమాతోనే మంచి సక్సెస్ అందుకున్నాడు. నేచురల్ యాక్టింగ్ తో ఆడియన్స్ ని ఆకట్టుకున్న సుహాష్.. ప్రస్తుతం హీరోగా వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. విలక్షణమైన పాత్రలు ఎంచుకుంటూ వస్తున్న సుహాష్.. ఇప్పుడు ''ఫ్యామిలీ డ్రామా'' అనే మరో వైవిధ్యమైన కథతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. మెహర్ తేజ్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఇటీవలే విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్ ఈ సినిమాపై ఆసక్తిని కలిగించింది. ఈ క్రమంలో తాజాగా ఫ్యామిలీ డ్రామా ట్రైలర్ ను చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది.టైటిల్ 'ఫ్యామిలీ డ్రామా' అయినప్పటికీ.. ట్రైలర్ చూస్తుంటే ఇదొక సైకో క్రైమ్ థ్రిల్లర్ అని అర్థం అవుతోంది. సుహాష్ ఇందులో సైకో కిల్లర్ గా నటించినట్లు తెలుస్తోంది. వినోదం కోసం మనుషుల గొంతు కోసి హత్య చేస్తూ కనిపిస్తున్నాడు. సుహాష్హెయిర్ స్టైల్ - బాడీ లాంగ్వేజ్.. అతని బిహేవియర్ కొత్తగా ఉన్నాయి. ఇన్నాళ్లూ సాధారణ రోల్స్ చేస్తూ వస్తున్న సుహాష్.. ఈసారి కంప్లీట్ డిఫరెంట్ గా సీరియల్ కిల్లర్ రోల్ ట్రై చేస్తున్నాడు.
 
తండ్రి వల్ల ఇబ్బందులు పడుతున్న ఓ ఫ్యామిలీకి సహాయం చేయడానికి వచ్చిన సైకో కిల్లర్ సుహాష్.. వారిని భయబ్రాంతులకు గురి చేస్తున్నట్లు 'ఫ్యామిలీ డ్రామా' ట్రైలర్ లో చూపించారు. దీనికి విజువల్స్ అద్భుతంగా ఉన్నాయి. బ్యాగ్రౌండ్ స్కోర్ ఉత్కంఠ కలిగిస్తోంది. ఈ సైకో కిల్లర్ వెనుక ఉన్న అసలు కథ ఏంటో తెలియాలంటే సినిమా విడుదల అయ్యే వరకు ఆగాల్సిందే. ఇకపోతే ఈ చిత్రంలో తేజ - పూజ కిరణ్ - శ్రుతి - అనూష - సంజయ్ ఇతర పాత్రలు పోషిస్తున్నారు.

రామ్ వీరపనేని సమర్పణలో చష్మా ఫిల్మ్స్ - నూతన భారతి ఫిల్మ్స్ బ్యానర్ పై 'ఫ్యామిలీ డ్రామా' సినిమా రూపొందుతోంది. అజయ్ - సంజయ్ ఈ చిత్రానికి సంగీతం సమకూరుస్తున్నారు. వెంకట్ ఆర్. శాకమూరి సినిమాటోగ్రఫీ అందిస్తుండగా.. రామకృష్ణ అర్రం ఎడిటింగ్ వర్క్ చేస్తున్నారు.