Begin typing your search above and press return to search.

వెట‌ర‌న్ హీరోల‌కి మ‌ళ్లీ మ‌ళ్లీ అవే తిప్ప‌లు

By:  Tupaki Desk   |   20 Feb 2020 9:00 AM GMT
వెట‌ర‌న్ హీరోల‌కి మ‌ళ్లీ మ‌ళ్లీ అవే తిప్ప‌లు
X
చిరంజీవి.. నాగార్జున‌.. వెంక‌టేష్.. బాల‌కృష్ణ వంటి వెట‌ర‌న్ హీరోల‌కు హీరోయిన్ల ఎంపిక అనేది ద‌ర్శ‌కుల‌కు స‌వాల్ గా మారుతున్న సంగ‌తి తెలిసిందే. అన్నీ రెడీగా ఉన్నా అనుకున్న టైమ్ లో హీరోయిన్లు దొర‌క‌డం లేదు. చిరంజీవి రీ ఎంట్రీ మూవీ `ఖైదీ నంబ‌ర్ 150` కోసం ఎంద‌రినో ప‌రిశీలించి చివ‌రికి కాజ‌ల్ అగ‌ర్వాల్ ను ఫైన‌ల్ చేశారు. వినాయ‌క్ అందుకోసం చాలానే శ్ర‌మించారు. అటుపై సైరా న‌ర‌సింహారెడ్డి విష‌యంలో అదే స‌న్నివేశం త‌లెత్తింది. కొత్త హీరోయిన్లు అందుబాటు లో ఉన్నా చిరు ఇమేజ్ దృష్ట్యా ఎంపిక చేయ‌లేని ప‌రిస్థితి. సీనియ‌ర్ నాయిక కోసం వెయిట్ చేసి చివ‌రికి న‌య‌న‌తార‌-త‌మ‌న్నాల‌ను క‌న్విన్స్ చేసారు.

ప్ర‌స్తుతం మెగాస్టార్ 152వ సినిమా క‌థానాయిక ఎవ‌రు? అన్న‌ది స‌స్పెన్స్ గానే క‌నిపిస్తోంది. ఫ‌లానా నాయిక అంటూ కొర‌టాల‌ ఇంకా అధికారికంగా వెల్ల‌డించ‌లేదు. త్రిష ను ఎంపిక చేసిన‌ట్లు ప్ర‌చార‌మైతే జ‌రుగుతోంది గానీ.. ఇందులో వాస్త‌వం ఎంతో తేల‌లేదు. ఇక నాగార్జున‌...వెంక‌టేష్ లకు అంత కాక‌ పోయినా.. నాయిక‌ల‌ స‌మ‌స్య అయితే ఉంది. ఎంచుకున్న క‌థ‌ను బ్ట‌టి వయ‌సుకు త‌గ్గ క‌టౌట్ల‌ను వెత‌కాల్సి వ‌స్తోంది.

ఇక న‌ట‌సింహ బాల‌కృష్ణ ప‌రిస్థితి అయితే టూమ‌చ్ ప్రాబ్ల‌మే. గ‌త కొన్నేళ్లుగా బాల‌య్య 106 కు హీరోయిన్ ని వెతుకుతున్నారు. న‌య‌న‌త‌ర‌...త్రిష‌...సోనాల్ చౌహ‌న్ అంటూ ఒక‌రో ఒక‌రిని అడ్జెస్ట్ అయి పోతున్నారు.

తాజాగా బాల‌య్య 106వ ప్రాజెక్ట్ కోసం హీరోయిన్ ఇంకా ఫైన‌ల్ కాలేదు. ద‌ర్శ‌కుడు బోయపాటి అదే ప‌ని మీద ఉన్నా ప‌ని పూర్త‌వ్వ‌డం లేదుట‌. క్యాథ‌రీన్ థ్రెసాను ఎంపిక చేశార‌ని ప్ర‌చార‌మైనా.. అమ్మ‌డు పారితోషికం ఎక్కువ డిమాండ్ చేయ‌డంతో నిర్మాత‌లు వెన‌క‌డుగు వేసిన‌ట్లు తెలిసింది. ఇక కాజ‌ల్ అగ‌ర్వాల్.. త‌మ‌న్నా లాంటి భామ‌ల్ని అడ‌గాలంటే పారితోషికం 2 కోట్లు ముట్ట‌జెప్పాలి. ఇక కియారా అద్వాణీ.. పూజా హెగ్డే లాంటి బిజీ యువ నాయిక‌లు బాల‌య్య స‌ర‌స‌న అంత ఈజీగా న‌టించే ఛాన్స్ లేదు. దీంతో బాల‌య్య కు హీరోయిన్ల ఎంపిక బోయ‌పాటికి మ‌రోసారి త‌ల‌ నొప్పిగానే మారింద‌ని ఇన్ సైడ్ టాక్ వినిపిస్తోంది. స్క్రిప్ట్ డిమాండ్ మేర‌కు బాల‌య్య‌ కు ఇద్ద‌రు నాయిక‌ల్ని ఎంపిక చేయాలి. మ‌రి అంతిమంగా ఎవ‌రిని ఫైన‌ల్ చేస్తారు? అన్న‌ది చూడాలి.