Begin typing your search above and press return to search.

స్టేజ్‌ షోకు కోటి తీసుకుంటున్న ఫేడ్‌ ఔట్‌ హీరోయిన్‌

By:  Tupaki Desk   |   1 Jun 2020 7:00 AM GMT
స్టేజ్‌ షోకు కోటి తీసుకుంటున్న ఫేడ్‌ ఔట్‌ హీరోయిన్‌
X
తెలుగులో స్టార్‌ హీరోయిన్‌ గా రెండు మూడు సంవత్సరాలు వెలుగు వెలిగిన ముద్దుగుమ్మ రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ ఒక్కసారిగా ఆఫర్లు లేకుండా ఢీలా పడిపోయింది. తెలుగులో ఈ అమ్మడు దాదాపు యంగ్‌ స్టార్‌ హీరోల అందరితో కూడా నటించింది. హిందీ.. తమిళంలో కూడా ఈ అమ్మడు నటించి మెప్పించింది. అయితే తెలుగులో ఎప్పుడైతే ఆఫర్లు తగ్గాయో అప్పటి నుండి ఈమెకు హిందీ మరియు తమిళంలో కూడా ఛాన్స్‌ లు లేకుండా పోయాయి.

సినిమాల్లో ఛాన్స్‌ లు లేకున్నా కూడా ఉత్తరాదిన ఈమెకు ఉన్న క్రేజ్‌ తో కోట్లు కురుస్తున్నాయి. ప్రస్తుతం ఈమె బడా ఫంక్షన్స్‌ లో స్టేజ్‌ షో లు చేస్తోంది. తనకున్న క్రేజ్‌ తో ఫుల్‌ బిజీగా గడిపేస్తున్న ఈ అమ్మడు ఏకంగా కోటి డిమాండ్‌ చేస్తోంది. స్టేజ్‌ షో లకు బాలీవుడ్‌ స్టార్స్‌ కోట్లు డిమాండ్‌ చేస్తున్నారు. వారితో పాటు రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ కూడా కోటి వసూళ్లు చేయడం ఆశ్చర్యకరంగా ఉంది. రకుల్‌ క్రేజ్‌ ఆ స్థాయిలో ఉందని ఉత్తరాది ఈవెంట్‌ మేనెజర్స్‌ అంటున్నారు.

ఓపెనింగ్స్‌ ఇంకా స్టేజ్‌ షో లతో రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ బిజీ బిజీగా గడిపేస్తుంది. హీరోయిన్‌ గా ఆఫర్లు రావడం ఇక అసాధ్యంగా భావించిన ముద్దుగుమ్మ ఇలా ఈవెంట్‌ స్టేజ్‌ షో లు చేయడంతో పాటు ఐటెం సాంగ్స్‌ కు కూడా ఓకే చెబుతోంది. దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి అన్నట్లుగా క్రేజ్‌ ఉన్నప్పుడే కోట్లు సంపాదించుకోవాలని ఈ అమ్మడి ప్లాన్‌ అదుర్స్‌ అంటూ నెటిజన్స్‌ కామెంట్స్‌ చేస్తున్నారు.