ఫ్యాక్ట్ చెక్.. రాకెట్రీ కోసం ఇల్లు అమ్మిన హీరో

Wed Aug 17 2022 21:49:59 GMT+0530 (India Standard Time)

Fact check Hero who sold house for rocketry

తమిళ స్టార్ హీరో మాధవన్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన రాకెట్రీ సినిమా ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెల్సిందే. మాధవన్ దాదాపు రెండేళ్ల పాటు ఈ సినిమా కోసం వర్క్ చేశారు.కరోనా కారణంగా ఆలస్యం అయినా కూడా విడుదల తర్వాత పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. హిందీతో పాటు సౌత్ లో అన్ని భాషల్లో విడుదల చేసిన ఈ సినిమా వసూళ్ల పరంగా నిరాశే మిగిలింది అనేది ట్రేడ్ వర్గాల టాక్.

ఈ సినిమా కోసం మాధవన్ తన ఇంటిని అమ్మేశాడని.. ఆయన సినిమా తో నష్టపోవాల్సి వచ్చిందంటూ పుకార్లు షికార్లు చేస్తున్నాయి.

ఇల్లు అమ్మడంతో పాటు మాధవన్ తీవ్రమైన ఆర్థిక సంక్షోభంలో చిక్కుకోవడానికి రాకెట్రీ సినిమా కారణం అంటూ తమిళ మీడియాలో గత వారం రోజులుగా పెద్ద ఎత్తున కథనాలు వస్తున్నాయి. దాంతో ఆ వార్త కథనాలపై మాధవన్ స్పందించాడు.

మీడియా పుకార్లు కొట్టిపారేశాడు. రాకెట్రీ వల్ల ఎవరు ఏమీ నష్టపోలేదు. దేవుడి దయ వల్ల రాకెట్రీ సినిమా లో భాగస్వామ్యం అయిన ప్రతి ఒక్కరు కూడా ఈ సంవత్సరం ప్రభుత్వం కు ఎప్పటి కంటే ఎక్కువ పన్ను చెల్లించారు అంటూ చెప్పుకొచ్చాడు. రాకెట్రీ సినిమా విషయంలో ఏ ఒక్కరు కూడా నష్టపోలేదు అంటూ ట్విట్టర్ ద్వారా పేర్కొన్నాడు.

రాకెట్రీ సినిమాకు ఆశించిన స్థాయిలో వసూళ్లు రాలేదు అనే మాట వాస్తవం. కాని సినిమాకి భారీ ఎత్తున బడ్జెట్ ను ఖర్చు చేయలేదు. పాతిక నుండి ముప్పై కోట్ల వరకు మాత్రమే సినిమా కోసం ఖర్చు చేశారట. అందుకే నష్టాలు అనేవి సినిమా కు రాలేదు అంటూ కొందరు విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.