ఫేస్ బుక్ లైవ్.. నటుడి ఆత్మహత్య యత్నం

Thu Jun 10 2021 14:00:01 GMT+0530 (IST)

Facebook Live .. Actor Suicide Attempt

కరోనా కారణంగా లక్షల మంది ఉపాది కోల్పోయి ఆర్థిక భారంతో క్రుంగి పోయారు. సినిమా మరియు బుల్లి తెర నటులు కూడా ఈ సమయంలో ఉపాది కోల్పోయి ఆర్థికంగా చితికి పోతున్నారు. ఈ సమయంలో కొందరు నటులు ఆర్థిక భారంతో ఆత్మహత్య యత్నం చేస్తుంటే మరి కొందరు మాత్రం భారంగా జీవితంను గడుపుతున్నారు. ఈ సమయంలోనే బెంగాళి నటుడు ఒకరు ఆత్మహత్య యత్నం చేశాడు. ఫేస్ బుక్ లైవ్ లోకి వచ్చి తాను ఆర్థికంగా చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాను. ఈ సమయంలో నాకు డబ్బు ఇచ్చిన వారికి కనీసం సమాధానం చెప్పలేక పోతున్నాను అంటూ ఆవేదన వ్యక్తం చేశాడు.లైవ్ లో పలు విషయాల గురించి మాట్లాడిన ఆ నటుడు ఇండస్ట్రీలో చాలా మంది ఆఫర్లు లేక ఇబ్బంది పడుతున్నారు. ఆర్థికంగా చాలా ఇబ్బందుల్లో ఉన్న నేనే జీవించాలని కోరుకోవడం లేదు అంటూ ఆత్మహత్య చేసుకోబోతున్నట్లుగా ప్రకటించాడు. లైవ్ లోనే అతడు తన వద్దు ఉన్న నిద్ర మాత్రలు అన్ని కూడా మింగేశాడు. బతికి ఉంటే మరో వీడియోలో కలుసుకుందాం అంటూ గుడ్ బై చెప్పేశాడు. అయితే లైవ్ చూసిన ఒక వ్యక్తి పోలీసులకు వెంటనే సమాచారం ఇవ్వడంతో ఆ నటుడి ప్రాణాలు దక్కాయి.

పోలీసులు వెంటనే స్పందించి అతడిని చేరుకుని ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అతడి ఆరోగ్యం పూర్తిగా కుదుట పడిందట. పోలీసులు అతడికి కౌన్సిలింగ్ ఇచ్చి పంపించారు. 31 ఏళ్ల ఆ నటుడు ఆత్మహత్య యత్నం చేయడం ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. కరోనా లాక్ డౌన్ కారణంగా ఇండస్ట్రీలో జూనియర్ ఆర్టిస్టులు ఇతర నటీనటులు ఎంతగా ఇబ్బందులు పడుతున్నారో దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు.