కాస్ట్యూమ్ డిజైనర్ రేప్.. గాయకుడిపై FIR

Mon Aug 15 2022 23:00:01 GMT+0530 (IST)

FIR against singer Rahul Jain for raping costume stylist

రంగుల పరిశ్రమలో లైంగిక వేధింపుల ప్రహసనం నిరంతరం చూస్తూనే ఉన్నాం. 30 ఏళ్ల కాస్ట్యూమ్ డిజైనర్ కం స్టైలిస్ట్ పై అత్యాచారానికి పాల్పడ్డాడంటూ ఫిర్యాదు చేయడంతో సింగర్ కం కంపోజర్ రాహుల్ జైన్ న్యాయపరమైన చిక్కుల్లో పడ్డారు.  ఎఫ్.ఐ.ఆర్ ప్రకారం.. ముంబై అంధేరీలో ఉన్న తన ఇంట్లో రాహుల్ ఆమెపై అత్యాచారం చేశాడు. ఆగస్ట్ 11న జరిగిన ఈ ఘటనపై పోలీసులు రాహుల్ పై ఎఫ్.ఐ.ఆర్ నమోదు చేశారు.ఓషివారా పోలీస్ స్టేషన్ లో రికార్డ్ చేసిన తన స్టేట్ మెంట్ లో ఫిర్యాదుదారు రాహుల్ తనను ఇన్ స్టాగ్రామ్ లో సంప్రదించారని తన పనిని మెచ్చుకున్నారని చెప్పారు. సబర్బన్ అంధేరిలోని ఎత్తైన భవనంలో ఉన్న తన ఫ్లాట్ ను సందర్శించాల్సిందిగా అతడు ఆమెను కోరాడని ఆమెను తన వ్యక్తిగత కాస్ట్యూమ్ స్టైలిస్ట్ గా నియమిస్తానని హామీ ఇచ్చాడని ఎఫ్.ఐ.ఆర్ ను ఉటంకిస్తూ పోలీసు అధికారి ఒకరు తెలిపారు. ఆగస్ట్ 11న రాహుల్ ఇంటికి వెళ్లిన తర్వాత తన వస్తువులను చూపుతానన్న నెపంతో తనతో పాటు పడక గదిలోకి రమ్మని చెప్పి అత్యాచారం చేశాడని ఆ మహిళ పేర్కొంది.

తాను ప్రతిఘటించడంతో దాడి చేశాడని ఆ తర్వాత సాక్ష్యాలను ధ్వంసం చేసేందుకు ప్రయత్నించాడని మహిళ పేర్కొంది. రాహుల్ పై భారత శిక్షాస్మృతి (ఐపీసీ) సెక్షన్‌లు 376 (రేప్)- 323 (స్వచ్ఛందంగా గాయపరచడం)- 506 (నేరపూరిత బెదిరింపు) కింద పోలీసులు ఎఫ్.ఐ.ఆర్ నమోదు చేసినట్లు అధికారి తెలిపారు. ఇప్పటి వరకు ఎవరినీ అరెస్టు చేయలేదు.

దీనిపై రాహుల్ స్పందిస్తూ-``ఈ మహిళ ఎవరో నాకు తెలియదు. ఆమె లేవనెత్తిన ఆరోపణలు అబద్ధం.. నిరాధారమైనవి. గతంలో కూడా ఓ మహిళ నాపై ఇలాంటి ఆరోపణలు చేసినా నాకు న్యాయం జరిగింది. ఈ స్త్రీ ఆ స్త్రీకి సహచరురాలు కావచ్చు`` అని అన్నారు.

రాహుల్‌పై లైంగిక వేధింపుల ఆరోపణలు రావడం ఇదే తొలిసారి కాదు. గత సంవత్సరం రాహుల్ అతని ఇద్దరు కుటుంబ సభ్యులపై అత్యాచారం.. బలవంతంగా అబార్షన్లు.. బిడ్డను విడిచిపెట్టడమే గాక.. యువతిని  మోసం చేసినట్లు ఆరోపణలు వచ్చాయి.

రాహుల్ 2014లో MTV షో MTV అలోఫ్ట్ స్టార్ లో పాల్గొన్నాడు. అనంతరం సంగీత పరిశ్రమలో తన వృత్తిని ప్రారంభించాడు. అతను వియు వెబ్-సిరీస్ `స్పాట్ లైట్` కోసం తేరీ యాద్ ఫర్ ఫీవర్.. 1921కి ఆనే వాలే కల్.. ఘర్ సే నిక్లా.. నా తుమ్ రహే తుమ్ .. చల్ దియా తుమ్సే డోర్ సహా మరెన్నో పాటలు పాడారు. అతను కాగజ్ - ఝూతా కహిన్ కా వంటి చిత్రాలకు స్వరకర్తగా కూడా పనిచేశాడు.