Begin typing your search above and press return to search.

FCUK ఫ‌స్ట్ సాంగ్ రిలీజ్‌.. ఫ్రంట్ లైన్ వారియర్ చేతుల మీదుగా..

By:  Tupaki Desk   |   25 Jan 2021 8:30 AM GMT
FCUK ఫ‌స్ట్ సాంగ్ రిలీజ్‌.. ఫ్రంట్ లైన్ వారియర్ చేతుల మీదుగా..
X
జ‌గ‌ప‌తిబాబు ప్ర‌ధాన పాత్ర‌లో.. రామ్ కార్తీక్‌, అమ్ము అభిరామి యువ‌ జంట‌గా రూపొందుతున్న చిత్రం 'ఎఫ్‌సీయూకే' (ఫాద‌ర్-చిట్టి-ఉమా-కార్తీక్‌). శ్రీ రంజిత్ మూవీస్ బ్యాన‌ర్‌పై కె.ఎల్. దామోద‌ర్ ప్ర‌సాద్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి.. విద్యాసాగ‌ర్ రాజు ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాలు కూడా కంప్లీట్ చేసుకున్న ఈ చిత్రం.. ఫిబ్ర‌వ‌రి 12న విడుద‌ల‌కు సిద్ధ‌మ‌వుతోంది.

కాగా.. ఈ చిత్రంలోని మొద‌టి పాట‌ను లేటెస్ట్ గా రిలీజ్ చేశారు. ప్ర‌ముఖ ఆర్థోపెడీషియ‌న్ డాక్ట‌ర్ ఎ.వి. గుర‌వారెడ్డి ఈ సాంగ్ ను విడుద‌ల చేశారు. ఈ సంద‌ర్భంగా జ‌గ‌ప‌తిబాబు మాట్లాడుతూ.. త‌మ మూవీ ఫ‌స్ట్ సాంగ్‌ను కరోనా మ‌హ‌మ్మారిపై పోరాటం చేస్తున్న ఫ్రంట్‌లైన్ వారియ‌ర్స్‌లో ఒక‌రైన గుర‌వారెడ్డి విడుద‌ల చేయ‌డం గౌర‌వంగా భావిస్తున్నామ‌ని అన్నారు. అనంత‌రం డాక్ట‌ర్ గుర‌వారెడ్డి మాట్లాడుతూ.. 'ఎఫ్‌సీయూకే' చిత్రంలోని పాట‌లు చాలా బాగున్నాయ‌ని అన్నారు. ఈ సినిమాను చూసేందుకు చాలా ఆస‌క్తిగా ఎదురుచూస్తున్న‌ట్టు చెప్పారు.

‘ముఝ్‌సే సెల్ఫీ లేలో..’ అంటూ.. సాగే ఈ సాంగ్‌ను రిలీజ్ చేసిన గురవారెడ్డి.. ట్యూన్స్‌కు త‌గ్గ‌ట్టుగా ఆ పాట‌ను ఆల‌పించ‌డం విశేషం. అనంతరం నిర్మాత కె.ఎల్‌. దామోద‌ర్ ప్ర‌సాద్ మాట్లాడుతూ.. పాట‌ల‌ను సినీ స్టార్ల‌తో కాకుండా కొవిడ్ హీరోల చేతుల మీదుగా రిలీజ్ చేయించ‌డానికి కారణం ఉందన్నారు. త‌మ ప్రాణాల‌ను ప‌ణంగా పెట్టి వారు చేస్తున్న సేవ‌‌కు తాము తెలుపుతున్న‌ చిన్న‌ కృత‌జ్ఞ‌త ఇది అని అన్నారు.

కాగా.. ఈ పాటను చిత్రంలోని యువజంట కార్తీక్, అమ్ము అభిరామిపై షూట్ చేశారు. నకాష్ అజీజ్, దివ్య భట్ ఆలపించిన ఈ గీతాన్ని ఆదిత్య రాశారు. మ్యూజిక్ డైరెక్ట‌ర్ భీమ్స్ సెసిరోలియో అందించిన సంగీతం ఆకట్టుకుంటోంది. ఫిబ్ర‌వ‌రి 6న "ముఝ్‌సే సెల్ఫీ లేలో.." పూర్తి వీడియో సాంగ్‌ను విడుద‌ల చేయ‌నున్న‌ట్లు డైరెక్ట‌ర్ విద్యాసాగ‌ర్ రాజు ప్ర‌క‌టించారు.