Begin typing your search above and press return to search.

ఎఫ్ 3 ఒకే షెడ్యూల్ లో లాగించేస్తార‌ట‌

By:  Tupaki Desk   |   15 Sep 2021 11:49 AM GMT
ఎఫ్ 3 ఒకే షెడ్యూల్ లో లాగించేస్తార‌ట‌
X
ప్ర‌స్తుతం ఎఫ్ 2 కొన‌సాగింపు భాగం ఎఫ్ 3 చిత్రీక‌ర‌ణ పెండింగులో ఉన్న సంగ‌తి తెలిసిందే. అనీల్ రావిపూడి ఈ చిత్రానికి ద‌ర్శ‌కుడు. వెంకటేష్.. వరుణ్ తేజ్.. తమన్నా .. మెహరీన్ ఈ సీక్వెల్ లోనూ కొన‌సాగుతున్నారు. మహమ్మారి రెండవ వేవ్ కారణంగా సినిమా షూటింగ్ నిలిచిపోయిన సంగ‌తి తెలిసిందే.

తాజా స‌మాచారం మేర‌కు.. F3 షూటింగ్ అక్టోబర్ మొదటి వారం నుండి ప్రారంభమవుతుంది. F3 రెండవ సగం మొత్తం ఒకే షెడ్యూల్ లో చిత్రీకరించనున్నారు. మేకర్స్ మొదట పెండింగ్ లో ఉన్న భాగాలను మైసూర్ లో చిత్రీకరించాలని అనుకున్నారు కానీ పరిస్థితులు అనుకూలంగా లేవు. ఈ సినిమా కోసం ప్రత్యేక హౌస్ సెట్ ని నిర్మించాలని మేకర్స్ ప్లాన్ చేసారు. కానీ ప్రణాళికలు మారాయి. మిగిలిన ఎఫ్ 3 ని హైదరాబాద్ లోని ప్రతిష్టాత్మక తాజ్ ఫలక్ నుమా ప్యాలెస్ లో చిత్రీకరిస్తారు.

సుదీర్ఘ షెడ్యూల్ లో ప‌ని పూర్తి చేస్తారు. పెండింగ్ లో ఉన్న చాలా భాగం షూటింగ్ ఫలక్ నుమా ప్యాలెస్ లో పూర్తవుతుంది. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ ప‌తాకంపై దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రం 2022 సంక్రాంతికి విడుదల చేయ‌నున్నారు. F3 సినిమా అంతటా డబుల్ ఎంటర్ టైన్ మెంట్ ఉంటుందని అనిల్ రావిపూడి వెల్లడించారు. దేవీశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవ‌లే వెంకీ న‌టించిన నార‌ప్ప రిలీజై ఓటీటీలో గొప్ప ఆద‌ర‌ణ ద‌క్కించుకుంటోంది. వ‌రుణ్ తేజ్ న‌టిస్తున్న గ‌ని చిత్రీక‌ర‌ణ ను ముగించి అత‌డు ఎఫ్ 3 సెట్స్ లో జాయిన‌వుతాడ‌ని స‌మాచారం.