'ఎఫ్ 3' టీమ్ నుంచి డిమాండ్స్ ఎక్కువ అవుతున్నాయా..?

Thu Nov 26 2020 13:00:29 GMT+0530 (IST)

Are the demands from the 'F3' team increasing?

విక్టరీ వెంకటేష్ - వరుణ్ తేజ్ హీరోలుగా నటించిన ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ 'ఎఫ్ 2: ఫన్ అండ్ ఫస్ట్రేషన్'. మిల్కీ బ్యూటీ తమన్నా - మెహ్రీన్ పిర్జాదా హీరోయిన్లుగా నటించారు. అనిల్ రావిపూడి దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్ రాజు నిర్మించారు. ఈ మల్టీస్టారర్ గతేడాది సంక్రాంతికి విడుదలై వరల్డ్ వైడ్ గా మంచిట్ల వసూళ్లను రాబట్టింది. ఇప్పుడు అనిల్ రావిపూడి దీనికి సీక్వెల్ 'ఎఫ్ 3' ని సెట్స్ పైకి తీసుకెళ్లాడనికి సన్నాహాలు చేస్తున్నారు. లాక్ డౌన్ సమయంలో ఈ సీక్వెల్ స్క్రిప్ట్ ని రెడీ చేసిన అనిల్ అండ్ టీమ్ డిసెంబర్ నుంచి షూటింగ్ వెళ్తారని తెలుస్తోంది. 'ఎఫ్ 3' ని కూడా దిల్ రాజు నిర్మించనున్నారు. అయితే ఈ సినిమాకి హీరోలు మరియు డైరెక్టర్ నుంచి డిమాండ్స్ ఎక్కువ అయ్యాయని టాక్ నడుస్తోంది.దిల్ రాజు డీసెంట్ బడ్జెట్ తో 'ఎఫ్ 2' చిత్రాన్ని నిర్మించి ప్రాఫిట్స్ అందుకున్నాడు. హీరోలు వెంకటేష్ - వరుణ్ తేజ్ మరియు దర్శకుడు అనిల్ రావిపూడి రెమ్యూనరేషన్ కూడా పెద్దగా డిమాండ్ చేయలేదని తెలుస్తోంది. అయితే ఇప్పుడు 'ఎఫ్ 3' కి ఉన్న క్రేజ్ ని బట్టి పారితోషకం అడుగుతున్నారట. 'సరిలేరు నీకెవ్వరు' సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న అనిల్.. 'ఎఫ్ 3' కి రేట్ పెంచేసాడట. అలానే వరుణ్ కూడా ఎక్కువ మొత్తం డిమాండ్ చేయడంతో పాటు మరో హీరో వెంకటేష్ కి సమానంగా తన పాత్ర ఉండాలని కోరుతున్నాడట. ఇదే కనుక నిజమైతే 'ఎఫ్ 2' కి మించి 'ఎఫ్ 3' బడ్జెట్ అయ్యే అవకాశం ఉంది. కోవిడ్ నేపథ్యంలో ఆచితూచి ఖర్చు చేయాల్సిన సమయంలో ఈ డిమాండ్స్ ప్రొడ్యూసర్ కి అధిక భారం కానున్నాయని ఫిలిం సర్కిల్స్ లో అంటున్నారు.