Begin typing your search above and press return to search.

'ఎఫ్ 3' ఫస్ట్ డే బాక్సాఫీస్ కలెక్షన్స్..!

By:  Tupaki Desk   |   28 May 2022 7:57 AM GMT
ఎఫ్ 3 ఫస్ట్ డే బాక్సాఫీస్ కలెక్షన్స్..!
X
విక్టరీ వెంకటేష్ - మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ లు హీరోలుగా సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి తెరకెక్కించిన ''ఎఫ్ 3'' సినిమా నిన్న శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. బ్లాక్ బస్టర్ 'ఎఫ్ 2' ఫన్ ప్రాంఛైజీలో రూపొందిన ఈ ఫ్యామిలీ అండ్ కామెడీ ఎంటర్టైనర్ కు తొలి రోజు తొలి ఆట నుంచే పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. దీంతో చాలా ఏరియాల్లో ఫస్ట్ అండ్ సెకండ్ షోలు హౌస్ ఫుల్స్ అయ్యాయి. ఈ నేపథ్యంలో మొదటి రోజు ఈ సినిమా భారీ బిజినెస్ చేసింది.

తెలుగు రాష్ట్రాలలో 'ఎఫ్ 3' సినిమా ఫస్ట్ డే ₹ 10.37 కోట్ల షేర్ రాబట్టిందని మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఈ మూవీ యూఎస్ఏలో గురువారం ప్రీమియర్లతో సహా మొదటి రోజు హాఫ్ మిలియన్ ($500K) డాలర్లకు పైగా వసూలు చేసింది. మొదటి వారాంతం ముగిసే నాటికి మిలియన్ డాలర్ల మార్క్‌ ను దాటే అవకాశం ఉంది.

'ఎఫ్ 2' సినిమాలోని ఫన్ అండ్ ఫ్రస్టేషన్ ను ఈసారి ‘ఎఫ్ 3’ లో డబ్బు నేపథ్యంలో చూపించారు. కథ పెద్దగా లేకపోయినప్పటికీ కావాల్సినంత వినోదం ఉండటంతో ప్రేక్షకులు ఈ చిత్రానికి బ్రహ్మరథం పడుతున్నారు. అనిల్ మార్క్ కామెడీ.. వెంకీ - వరుణ్ తేజ్ - సునీల్ - అలీ ల పెర్ఫార్మన్స్ ఆడియన్స్ ను ఆకట్టుకుంటున్నాయి.

'F 3' చాలా రోజుల తర్వాత ఫ్యామిలీ ఆడియన్స్ ను థియేటర్లకు రప్పిస్తోంది. శని ఆదివారం అడ్వాన్స్ బుకింగ్స్ ఆశాజనకంగా ఉన్నాయి. ఇలాంటి సినిమాలకు రిపీట్ వాల్యూ ఉంటుంది కాబట్టి.. బాక్సాఫీస్ వద్ద మరికొన్ని రోజులు మంచి కలెక్షన్స్ అంచనా వేయొచ్చు.

'ఎఫ్ 3' మూవీ మొదటి రోజు ఆంధ్రప్రదేశ్/తెలంగాణ షేర్ వివరాలు...

నైజాం ౼ 4.06 కోట్లు

UA ౼ 1.18 కోట్లు

గుంటూరు ౼ 88 లక్షలు

నెల్లూరు ౼ 62 లక్షలు

తూర్పు ౼ 76 లక్షలు

వెస్ట్ ౼ 94 లక్షలు

కృష్ణ ౼ 67 లక్షలు

సెడెడ్ ౼ 1.26 కోట్లు

మొత్తం AP/TS షేర్ ౼ 10.37 కోట్లు

కాగా, 'ఎఫ్ 3' సినిమాలో వెంకేటేష్ సరసన తమన్నా భాటియా.. వరుణ్ తేజ్ సరసన మెహ్రీన్ కౌర్ హీరోయిన్లుగా నటించారు. సోనాల్ చౌహాన్ స్పెషల్ రోల్ లో కనిపించగా.. ఐటెం సాంగ్‌లో పూజా హెగ్డే ఆడిపాడింది. దిల్ రాజు సమర్పణలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై శిరీష్ ఈ చిత్రాన్ని నిర్మించారు. దేవిశ్రీ ప్ర‌సాద్ సంగీతం సమకూర్చగా.. సాయి శ్రీరామ్ సినిమాటోగ్రఫీ అందించారు.