Begin typing your search above and press return to search.

'ఎఫ్ 3' టీమ్ దసరా స్పెషల్ వీడియో..!

By:  Tupaki Desk   |   15 Oct 2021 6:33 AM GMT
ఎఫ్ 3 టీమ్ దసరా స్పెషల్ వీడియో..!
X
విక్టరీ వెంకటేష్ - మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోలుగా తెరకెక్కుతున్న ఫ్యామిలీ అండ్ కామెడీ ఎంటర్టైనర్ ''ఎఫ్ 3''. రెండేళ్ల క్రితం సంక్రాంతి కి వచ్చి సూపర్ హిట్ అయిన 'ఎఫ్-2: ఫన్ అండ్ ఫస్ట్రేషన్' ఫ్రాంచైజీలో ఈ సినిమా రూపొందుతోంది. బ్లాక్ బస్టర్ డైరెక్టర్ అనిల్ రావిపూడి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా చివరి షెడ్యూల్ షూటింగ్ హైదరాబాద్ లో జరుగుతోంది. శేఖర్ మాస్టర్ నేతృత్వంలో ఓ సాంగ్ ని చిత్రీకరిస్తున్నట్లు తెలుస్తోంది. ఈరోజు దసరా పండగ పర్వదినాన్ని పురస్కరించుకుని చిత్ర బృందం ఓ స్పెషల్ వీడియోని విడుదల చేసింది.

'ఎఫ్ 3' సెట్స్ లో ప్రధాన నటీనటులు - దర్శక నిర్మాతలు అందరూ ఈ వీడియో ద్వారా తెలుగు ప్రేక్షకులకు విజయ దశమి శుభాకాంక్షలు తెలియజేసారు. సినిమా షూటింగ్ అంతా భారీ తారగణంతో ఆహ్లాదకరమైన వాతావరణంలో జరుగుతున్నట్లు తెలుస్తోంది. రెట్టింపు ఫన్ డోస్ ఇవ్వడానికి రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది. ఇందులో వెంకీ - వరుణ్ - తమన్నా - మెహ్రీన్ లతో పాటుగా బాలీవుడ్ బ్యూటీ సోనాలి చౌహన్ కనిపిస్తోంది. అలానే సునీల్ - రాజేంద్ర ప్రసాద్ - మురళీ శర్మ - రఘుబాబు - శ్రీకాంత్ అయ్యంగార్ - అన్నపూర్ణ - వై. విజయ - ప్రగతి - పృథ్వీరాజ్ ఈ వీడియోలో ఉన్నారు. వీటితో పాటుగా బొమన్ ఇరానీ - వెన్నెల కిషోర్ ఈఈ చిత్రంలో కీలక పాత్రలు పోషిస్తున్నారు.

'ఎఫ్ 2' చిత్రంలో ఫస్ట్రేషన్ నుంచి ఫన్ ని క్రియేట్ చేసిన అనిల్ రావిపూడి.. ''ఎఫ్ 3'' సినిమాలో ఫైనాన్స్ ని జత చేసి మరింత వినోదాన్ని పంచబోతున్నారని తెలుస్తోంది. వరసగా ఐదు ఘన విజయాలు అందుకున్న అనిల్.. ఈ సినిమాతో డబుల్ హ్యాట్రిక్ హిట్ కొడతారని అభిమానులు ధీమాగా ఉన్నారు. ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలు ఆకట్టుకున్నాయి. సినిమా కథ అంతా డబ్బుల చుట్టూనే తిరగనుందని హింట్ ఇచ్చారు. వచ్చే ఏడాది ప్రథమార్థంలో ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ చిత్రం ఏ స్థాయిలో నవ్వులు పంచుతుందో చూడాలి.

'ఎఫ్ 3' చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు - శిరీష్ కలిసి నిర్మిస్తున్నారు. హర్షిత్ రెడ్డి సహ నిర్మాత. రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ ఈ చిత్రానికి సంగీతం సమకూరుస్తున్నారు. సాయి శ్రీరామ్ సినిమాటోగ్రఫీ అందిస్తుండగా.. తమ్మిరాజు ఎడిటింగ్ వర్క్ చేస్తున్నారు. ఏఎస్ ప్రకాష్ ఆర్ట్ డైరెక్టర్ గా వ్యవహరిస్తున్నారు. త్వరలోనే ఈ సినిమా విడుదల తేదీపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.