Begin typing your search above and press return to search.

F3 డేట్ లాక్ .. సంక్రాంతిని మిస్స‌య్యారుగా!

By:  Tupaki Desk   |   24 Oct 2021 9:31 AM GMT
F3 డేట్ లాక్ .. సంక్రాంతిని మిస్స‌య్యారుగా!
X
దసరా బ‌రిలో మిస్స‌యినా సంక్రాంతి బ‌రిలో వ‌స్తుంద‌నుకున్న‌ F3 అప్పుడు కూడా రావ‌డం లేదు. ఫిబ్ర‌వ‌రిలో తేదీని ఫిక్స్ చేసుకోవ‌డం విశేషం. నిజానికి ఈ సినిమాని వంద‌శాతం బౌండ్ స్క్రిప్టుతో సెట్స్ పైకి తీసుకెళ్లిన రావిపూడి స‌కాలంలో పూర్తి చేసేందుకు త‌న‌వంతుగా ప్ర‌య‌త్నించారు. కానీ క‌రోనా మ‌హ‌మ్మారీ వెంబ‌డించ‌డంతో అది కాస్తా ఆల‌స్య‌మైంది.

లాక్ డౌన్ లో వంద‌శాతం స్క్రిప్టును రెడీ చేసుకుని వెంకటేష్ -వరుణ్ తేజ్ ల కాల్షీట్ల‌ను లాక్ చేసి షెడ్యూల్స్ ని కొన‌సాగించారు. F3 నిర్మాతలు దిల్ రాజు - శిరీష్ అవసరమైన అన్ని వనరులను స‌మ‌కూర్చారు. తాజా స‌మాచారం మేర‌కు.. F3 విడుదల తేదీ లాక్ అయింది. ఈ సినిమా వచ్చే ఏడాది ఫిబ్రవరి 25న ప్రేక్షకుల ముందుకు రానుంది. F3 వంటి ఫ్యామిలీ ఎంటర్టైనర్లు థియేటర్లలో ఎప్పుడు వ‌చ్చినా మంచి రిజ‌ల్టును అందుకునేందుకు ఆస్కారం ఉంద‌న్న న‌మ్మ‌కం టీమ్ లో క‌నిపించింది.

సీక్వెల్‌పై ఉన్న అంచనాలను అందుకోవడానికి F3లో ఫన్ గ్లామర్ డోస్ పెంచారు. ఉత్త‌రాది హాట్ గాళ్ సోనాల్ చౌహాన్ మూడో హీరోయిన్ గా నటిస్తుండగా త‌న పాత్ర ఎంతో ఆస‌క్తి క‌లిగిస్తుంద‌ని సోనాల్ చెబుతోంది. ఇందులో సునీల్ మ‌రో కీలక పాత్రను పోషిస్తున్నారు. చాలా మంది నటులతో తెర నిండుగా క‌నిపించ‌నుంది.

ఎఫ్ 2ని మించి ప‌దింత‌లు వినోదాన్ని అందిస్తామ‌ని రావిపూడి చెబుతున్నారు. అందుకు త‌గ్గ‌ట్టే స‌న్నివేశాల్ని మ‌లుస్తున్నార‌ని స‌మాచారం. రాక్‌స్టార్ దేవి శ్రీ ప్రసాద్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. ప్రస్తుతం హైదరాబాద్ లో చిత్రీకరిస్తున్నారు. టోట‌ల్ తారాగ‌ణంపై స‌న్నివేశాలు తెర‌కెక్కుతున్నాయ‌ని స‌మాచారం. సంక్రాంతి బ‌రిలో తీవ్ర‌మైన పోటీని దృష్టిలో పెట్టుకుని ఎఫ్ 3 రిలీజ్ ఫిబ్ర‌వ‌రి వ‌ర‌కూ వెళ్లింది. ఇక‌పోతే ఆర్.ఆర్.ఆర్ లాంటి భారీ పాన్ ఇండియా చిత్రం తో పాటు ప‌లువురు అగ్ర హీరోల చిత్రాలు సంక్రాంతి బ‌రిలో పోటీప‌డుతున్న సంగ‌తి తెలిసిన‌దే.