Begin typing your search above and press return to search.

'F 3' స్పెషల్ వీడియో: ₹ 2000 నోట్ల కట్టతో మెగా ప్రిన్స్ హంగామా..!

By:  Tupaki Desk   |   19 Jan 2022 3:09 PM GMT
F 3 స్పెషల్ వీడియో: ₹ 2000 నోట్ల కట్టతో మెగా ప్రిన్స్ హంగామా..!
X
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ పుట్టినరోజు సందర్భంగా బుధవారం అభిమానుల కోసం కొన్ని సర్ప్రైజులు వచ్చాయి. వరుణ్ ప్రస్తుతం నటిస్తున్న 'గని' సినిమా నుంచి 'పవర్ ఆఫ్ గని' పేరుతో ఓ స్పెషల్ గ్లిమ్స్ ని రిలీజ్ చేశారు. అలానే 'ఎఫ్ 3' చిత్రం నుంచి ప్రత్యేకమైన పోస్టర్ అవిష్కరించబడింది. ఈ క్రమంలో వరుణ్ కు శుభాకాంక్షలు తెలుపుతూ తాజాగా 'F 3' టీమ్ బర్త్ డే స్పెషల్ వీడియోని విడుదల చేసింది.

ఇందులో వరుణ్ తేజ్ తన చేతిలో ఉన్న షూట్ కేసును పక్కకి విసిరేసి.. 2000 రూపాయల నోట్ల కట్టను చేత్తో పట్టుకొని గాలి విసురుకోవడం ఆకట్టుకుంటోంది. సాంగ్ కు సంబంధించిన ఈ వీడియోలో మెగా హీరో సూటు బూటు ధరించి చాలా స్టైలిష్ గా కనిపిస్తున్నారు. అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందుతోన్న ''ఎఫ్ 3''.. సూపర్ హిట్ 'ఎఫ్ 2' చిత్రానికి సీక్వెల్ అన్న సంగతి తెలిసిందే.

'ఎఫ్‌ 2' సినిమాలో భార్యాభర్తల కథకు ఫన్‌ - ఫస్ర్టేషన్‌ కలిపి చూపించగా.. ఈసారి 'ఎఫ్ 3' లో డబ్బు అనే ఎలిమెంట్‌ ని జత చేసి మూడింతల ఫన్ అందించబోతున్నారు. కొత్త కథతో అవే పాత్రలు - క్యారెక్టరైజేషన్లతో ఈ సినిమా తెరకెక్కుతోందని మేకర్స్ ఇప్పటికే క్లారిటీ ఇచ్చారు. ఇందులో డబ్బుకు ఎక్కువ ప్రాధాన్యత ఉంటుందని తాజాగా విడుదలైన స్పెషల్ వీడియోని బట్టి అర్థం అవుతోంది.

'ఎఫ్ 3' చిత్రంలో వరుణ్ తేజ్ తో పాటుగా విక్టరీ వెంకటేష్ సందడి చేయనున్నారు. ఇందులో వెంకీ రేచీకటి బాధితుడిగా.. వరుణ్ నత్తిగా మాట్లాడే యువకుడిగా కనిపించనున్నారు. తమన్నా భాటియా - మెహ్రీన్ కౌర్ హీరోయిన్లుగా నటించగా.. సోనాలి చౌహన్ మరింత గ్లామర్ ని జోడించబోతోంది. సునీల్ - రాజేంద్ర ప్రసాద్ - వెన్నెల కిషోర్ - మురళీ శర్మ - రఘుబాబు - శ్రీకాంత్ అయ్యంగార్ - పృథ్వీరాజ్ తదితరులు ఇతర పాత్రలు పోషిస్తున్నారు.

దిల్ రాజు సమర్పణలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై శిరీష్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. హర్షిత్ రెడ్డి సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ సంగీతం సమకూరుస్తున్నారు. ఎస్ కృష్ణ స్క్రిప్ట్ కో ఆర్డినేటర్ గా.. సాయి శ్రీరామ్ సినిమాటోగ్రాఫర్ గా వర్క్ చేస్తున్నారు. 'సమ్మర్ సోగ్గాళ్ళు' ట్యాగ్ లైన్ తో ఏప్రిల్ 28న ''ఎఫ్ 3'' మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది.