ఎక్స్ క్లూసివ్ - నలుగురుతో చాలా ఫాస్ట్ గా కలిసిపోతాను

Tue Jun 02 2020 10:00:19 GMT+0530 (IST)

Exclusive - Special chit chat with Nidhi Agerwal

* హాయ్ నిధి ఎలా ఉన్నారుహాయ్ నేను బావున్నా మీరు బాగున్నారా

* ఐయామ్ ఫైన్ నిధి ఇంతకీ ఎంత వరకు వచ్చాయి మీ ఆన్ లైన్ యాక్టింగ్ క్లాస్ లు

నేను షూజ్ చేసుకున్న ప్యాకేజ్ ఆల్ మోస్ట్ ఎండింగ్ కి వచ్చేసింది ఎన్నో కొత్త విషయాలు నేర్చుకున్నా అసలు ఎలాంటి యాక్టింగ్ బ్యాక్ గ్రౌండ్ లేకుండా నేను సినిమాల్లోకి అడుగుపెట్టాను జస్ట్ నేను ఇచ్చిన ఒక నార్మల్ ఆడిషన్ చూసి నన్ను నా మొదటి సినిమాలోకి తీసుకున్నారు. ఆ తరువాత ఇక ఇలా వరుసపెట్టి ఆఫర్లు వస్తున్నాయి నేను కంటిన్యూ అవుతున్నాను. అయితే ప్రస్తుతం కొద్దిగా గ్యాప్ దొరకడంతో నేను ఇప్పటి వరకు నటించిన సినిమాలు ద్వారా వచ్చిన ప్రాక్టికల్ యాక్టింగ్ ఎక్స్ పీరియన్స్ కి ఇప్పుడు నేను తీసుకుంటున్న థియరీ కూడా యాడై ఇంకాస్త నా నటన మెరుగుఅవుతుందని నా ఫీలింగ్.

* అంటే మీకు నటన పెద్దగా రాదు అని ఒప్పుకున్నట్లేనా

(నవ్వుతూ) నేను చెప్పిన ఇంత పెద్ద ఆన్సర్ మీకు ఇలా అర్ధమైందా వాస్తవానికి యాక్టింగ్ అనేది నెవర్ ఎండింగ్ ప్రాసెస్ ఎంత నేర్చుకున్న ఈ ఫీల్డ్ లో ఎంత ఎక్స్ పీరియన్స్ ఉన్నా సరే ఎంతో కొంత మిగిలే ఉంటుంది. అందుకే వీలు చిక్కినప్పుడుల్లా నా యాక్టింగ్ స్కిల్స్ ని డెవలప్ చేసుకోవడానికి ట్రై చేస్తున్నా అంతే. మనకి ఎంత వచ్చిన ఒదిగి ఉండటమే మంచిది కదా కదాంటారా

* నిధి చాలా హైపర్ యాక్టివ్ అని విన్నాము నిజమేనా

(నవ్వుతూ) నూటికి నూరు శాతం నిజం నేను ఎప్పుడు చాలా ఎనర్జిటిక్ గా ఉంటాను. నవ్వుతూ జోకులు వేస్తూ గెంతుతూనే ఉంటాను. నాకు ఒక చోట్ కుర్చోవడం ఐడిల్ గా ఉండటం అస్సలు నచ్చదు. నలుగురుతో చాలా ఫాస్ట్ గా కలిసిపోతాను

* మీ రియల్ క్యారెక్టర్ కి మీకు వస్తున్న రీల్ క్యారెక్టర్స్ కి చాలా ఢిఫరెన్స్ ఉన్నట్లు ఉంది

అవునండి బయట చాలా చలాకీగా ఉండే నాకు ఇప్పటి వరకు దాదాపు చాలా మైల్డ్ గా స్లోగా ఉండే క్యారెక్టర్లు మాత్రమే వచ్చాయి. ఫ్యూచర్ లో ఇలాంటి క్యారెక్టర్లు నుంచి బయటపడతాను అనుకుంటున్నా. అయితే ఆ కోరిక నా అప్ కమింగ్ తమిళ్ మూవీ భూమితో తీరింది. ఈ సినిమాలో నా క్యారెక్టర్ నా రియల్ క్యారెక్టర్ కి చాలా దగ్గరగా ఉంది. ఈ సినిమాలో నేను యాక్ట్ చేసినట్లు అస్సులు నాకు అనిపించలేదు. కొన్ని రోజులు చెన్నై వేరు వేరు చోట్ల నేను బ్రతికాను అన్నట్లు తోచింది. ఈ సినిమా కోసం నేను చాలా వెయిట్ చేస్తున్నా

* తమిళ్ తెలుగు హిందీ ఇలా అన్ని భాషల్లో నటిస్తున్నారు మరి మీకు బాగా నచ్చిన ఇండస్ట్రీ ఏది

ఏ ఇండస్ట్రీలో అయితే నాకు ప్రేమ రెస్పెక్ట్ పని దొరుకుతుందో ఆ భాష చిత్ర పరిశ్రమే నాకు నచ్చుతుంది. నా అదృష్టం కొద్ది నేను ఇప్పటి వరకు చేసిన అన్ని భాషల్లో అందరూ నన్ను బాగానే ఆదిరించారు.

* వెరీ డిప్లమెటిక్ ఆన్సర్ మరి కన్నడలో కూడా అడుగుపెడుతున్నారు అని అంటున్నారు నిజమేనా

లేదండి కన్నడలో నేను నటించడం లేదు ఆ వార్తలు అన్ని జస్ట్ రూమర్స్ కానీ ఫ్యూచర్ లో నటిస్తానేమో ప్రస్తుతానికి మాత్రం నా ఫోకస్ మొత్తం నేను ఇప్పటికి సైన్ చేసిన సినిమాలు మీదే ఉంది.

* మీ ఫోకస్ మీ ఫ్యూచర్ మీ అప్ కమింగ్ మూవీస్ మొత్తం గ్రాండ్ సక్సెస్ అవ్వాలని మా తుపాకీ డాట్ కామ్ టీమ్ మనః స్పూర్తిగా కోరకుంటున్నాము ఆల్ ది బెస్ట్

సో స్వీట్ థ్యాంక్యూ సో మచ్ తుపాకీ డాట్ కామ్ రీడర్స్ అందరూ ప్లీజ్ స్టే హోమ్ - స్టే సేఫ్ లాక్ డౌన్ రిలాక్షేషన్ ఇచ్చినా అత్యఅవసరం అయితేనే బయటకు వెళ్లండి ఆల్ ది బెస్ట్