`మా` ఎన్నికల తేదీపై సర్వత్రా ఉత్కంఠ

Sun Aug 01 2021 09:18:20 GMT+0530 (IST)

Excitement over MAA election date

`మా` ఎన్నికలు ప్రస్తుతం ఇండస్ట్రీ వర్గాల్లో సర్వత్రా ఉత్కంఠ రేపుతున్న అంశం. కేవలం 950 మంది సభ్యులతో ఉన్న మా అసోసియేషన్ కి ఇంతటి ప్రాధాన్యత ఎందుకు? అన్నది ఎవరికీ అర్థం కాని అంశం. మూవీ ఆర్టిస్టుల అధ్యక్ష పదవి అన్నది కేవలం వ్యామోహం మాత్రమేనని దాంతో సంపాదించలేమని.. అది ఒక హోదా మాత్రమేనని కొందరు సినీపెద్దలు సూత్రీకరిస్తున్నా కానీ.. దాని వెనక ఏదో పెద్ద మతలబు ఉందని చాలా మంది భావిస్తున్నారు. అలా భావించేలా నిరంతరం ఏవో లుకలుకలు బయటకు వస్తూనే ఉన్నాయి.



చాలా మందిలో ఆసక్తిని పెంచే మా ఎన్నికల టాపిక్ ని టీఆర్పీలుగా మలుచుకునేందుకు ఒక సెక్షన్ మీడియా ఎప్పుడూ సిద్ధంగానే ఉంటుందని తెలిసీ మీడియా ముందు బహిరంగ ప్రకటనలతో ఇప్పటికే పోటీదార్లు రెచ్చిపోయిన సంగతి తెలిసిందే. ఇప్పటికే పలువురు మీడియా మీటింగులతో రచ్చకెక్కారు. ప్రకాష్ రాజ్.. మంచు విష్ణు ఈసారి ప్రధానంగా రేస్ లో ఉన్నారు. అధ్యక్ష పదవి కోసం పోటీపడుతున్నారు. సీనియర్ నరేష్ తన వర్గంతో ప్రకాష్ రాజ్ కి వ్యతిరేక ప్రచారం నడిపిస్తున్న సంగతి తెలిసినదే.

రచ్చను ఆపేందుకు లేదా ఇంకా పెంచేందుకు ఆగస్టులో ఈసీ మీటింగ్ జరగనుంది. ఇంతకుముందు కృష్ణంరాజు అధ్యక్షతన వర్చువల్ ఈసీ మీటింగ్ లో మా ఎన్నికల నిర్వహణపైనా ముచ్చటించారు. కానీ ఎన్నికల తేదీపై అంతగా స్పష్ఠత లేదు. అయితే మెజారిటీ సభ్యులు ఎన్నికలకు వెళ్లాలనే కోరడంతో ఆ దిశగా ఆలోచిస్తున్నారని సమాచారం. ఫిల్మ్ సర్కిల్స్ లో తాజా సమాచారం మేరకు సెప్టెంబర్ 12న `మా` ఎన్నికలు జరగనున్నాయి. ఇన్నాళ్లు ఎన్నికలు ఉంటాయా లేదా? అన్న డైలమా నెలకొనగా కొంతవరకూ స్పష్ఠత వచ్చినట్టేనని భావిస్తున్నారు. థర్డ్ వేవ్ ప్రభావం ఇప్పటివరకూ లేదు కాబట్టి ఎన్నికల నిర్వహణకు సన్నాహకాల్లో ఉన్నారని కథనాలొస్తున్నాయి.

ఇప్పటికే ఎన్నికల తేదీ ఫిక్సయ్యిందా లేదా? అన్నది ఇంకా నిర్ధారణకు రాలేదు.. కానీ ఫిల్మ్ సర్కిల్స్ లో ఇది నిరంతరం హాట్ టాపిక్ గా మారుతోంది. కొంతమంది పెద్దలు దీనిపై గుసగుసలు ఆడుతున్నారు. ఈసారి ఎన్నికల్లో గట్టి పోటీ ఉంటుంది. అధ్యక్ష పదవికి ఆరుగురు పోటీపడుతుండగా ప్రకాష్ రాజ్ వర్సెస్ మంచు విష్ణు! ఎపిసోడ్స్ పైనా అంతా ఆసక్తిగా ఉన్నారు.  మా ప్రతిష్టాత్మక పదవిలో ఎవరు గెలుస్తారో చూడాలి.