వైకుంఠపురంపై అదనపు భారం ?

Mon Aug 19 2019 21:00:02 GMT+0530 (IST)

Excess Burden On Vaikunthampuram Movie

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ - త్రివిక్రమ్ కాంబోలో రూపొందుతున్న అల వైకుంఠపురం టైటిల్ మీద మిశ్రమ స్పందన వ్యక్తమైనప్పటికీ రిలీజ్ టైంకి అదంతా పాజిటివ్ గా మారిపోతుందనే అంచనాలో ఉన్నారు అభిమానులు. దాని సంగతి అలా ఉంచితే ఇప్పుడీ సినిమా నిర్మిస్తున్న సితార బ్యానర్ మీద గత సినిమాల ఫలితాల ఒత్తిడి పడుతోందని ఫిలిం నగర్ టాక్. ఇటీవలే ఈ సంస్థ నిర్మించిన రణరంగం ఆశించిన ఫలితం అందుకోలేక నష్టాలు మిగిల్చే దిశగా వెళ్తోంది.అంతకు ముందు తీసిన నాని జెర్సీ లెక్కలేనన్ని ప్రశంసలైతే తెచ్చింది కాని లెక్కలు మాత్రం కొంచెం తేడా కొట్టాయి. జరిగిన బిజినెస్ ప్రకారం ఓ 30 శాతం దాకా లాస్ వచ్చినట్టుగా ఇన్ సైడ్ టాక్ ఉంది. వీటికి సంబంధించిన రికవరీ వేరే సినిమా ద్వారా చేయమని డిస్ట్రిబ్యూటర్లు అడుగుతున్నారట. ఇప్పుడు అది అల వైకుంఠపురం రూపంలో అడ్జస్ట్ చేయాల్సి వస్తుందేమో అని అంతర్గతంగా జరుగుతున్న చర్చల సమాచారం

కానీ ఈ ప్రాజెక్ట్ లో గీతా ఆర్ట్స్ కు భాగస్వామ్యం ఉంది. అందులోనూ బన్నీ సినిమా. సో సితార గతం తాలూకు నష్టాలకు ఈ మూవీని పణంగా పెడతామంటే ఒప్పుకోకపోవచ్చు. ఒకవేళ అలా కాకపోయినా సితార తనకు రావాల్సిన షేర్ లో నుంచే బయ్యర్లకు త్యాగం చేయాల్సి ఉంటుంది. ఇవన్ని గాసిప్స్ రూపంలో చక్కర్లు కొడుతున్న వార్తలే.

కానీ ఇప్పుడీ లీక్ బయటికి రావడానికి కారణం వైకుంఠపురంకు జరుగుతున్న ట్రేడ్ ఎంక్వయిరీస్ లో భాగంగా ఈ చర్చ వస్తోందట. దీనికి పరిష్కారం ఏమనుకుంటున్నారో తెలియదు కానీ మొత్తానికి టాపిక్ అయితే చాలా హాట్ గా ఉన్న క్లారిటీ అయితే కనిపిస్తోంది. వచ్చే సంక్రాంతికి విడుదల కానున్న అల వైకుంఠపురంలో పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తుండగా తమన్ స్వరాలు సమకూరుస్తున్నాడు.