Begin typing your search above and press return to search.

సెకండ్ ఇన్నింగ్స్‌ లో కూడా స్కిన్‌ షో కు సై అంటోంది

By:  Tupaki Desk   |   25 Jan 2021 2:30 AM GMT
సెకండ్ ఇన్నింగ్స్‌ లో కూడా స్కిన్‌ షో కు సై అంటోంది
X
హీరోయిన్ గా జాతీయ అవార్డును దక్కించుకున్న ప్రియమణి ప్రస్తుతం బుల్లి తెరతో పాటు వెండి తెరపై కంటిన్యూస్ గా కనిపిస్తూనే ఉంది. ప్రస్తుతం హీరోయిన్‌ గా కాకుండా క్యారెక్టర్ ఆర్టిస్టుగా నటిస్తుంది. వైవాహిక జీవితంలో అడుగు పెట్టిన ఈ అమ్మడు సినిమాల ఎంపిక విషయంలో ఆచితూచి వ్యవహరించే అవకాశం ఉందని అంతా భావించారు. కాని పెళ్లి తర్వాత కూడా ఈ అమ్మడు తన జోరును కొనసాగిస్తుంది. ప్రస్తుతం ఈమె తెలుగుతో పాటు ఇతర భాషల్లో సినిమాలు మరియు వెబ్ సిరీస్ లు కూడా నటిస్తుంది. అవకాశాలు మరింతగా దక్కించుకునేందుకు ఆసక్తికర వ్యాఖ్యలను ప్రియమణి చేసింది.

తాజాగా ఒక చిట్‌ చాట్ లో ప్రియమణి స్పందిస్తూ... కథ డిమాండ్‌ చేస్తే గతంలో మాదిరిగా స్కిన్‌ షో కు బికినికి ఎలాంటి అభ్యంతరాలు లేవు అంటూ క్లారిటీ ఇచ్చింది. ప్రస్తుతం ఈమె చేస్తున్న సినిమాల్లో ఎక్కువగా పద్దతిగా కనిపించేవే. కాని ఈమె కథ డిమాండ్‌ చేస్తే బికినీలో కనిపించేందుకు కూడా సై అంటోంది. సెకండ్‌ ఇన్నింగ్స్ లో స్కిన్ షో కు ఒప్పుకునే వారు చాలా తక్కువ ఉంటారు. కాని ఈ అమ్మడు మాత్రం అనూహ్యంగా స్కిన్‌ షో చేసేందుకు గ్రీన్ సిగ్నల్‌ ఇచ్చింది. ఈమె వ్యాఖ్యలతో ఖచ్చితంగా ఆఫర్లు వస్తాయని అంటున్నారు. వ్యాంప్‌ పాత్రలో మరియు బికినీలో కూడా కనిపించేందుకు ప్రియమణి మళ్లీ బిజీ బిజీ స్టార్‌ గా మారే అవకాశం ఉందని ఇండస్ట్రీ వర్గాల వారు అంటున్నారు.