సక్సెస్ లు లేకపోయినా యామీ యమా బిజీ!

Tue Nov 29 2022 11:17:23 GMT+0530 (India Standard Time)

Even if there are no successes, Yami Gautham is busy!

బాలీవుడ్ బ్యూటీ యామీ గౌతమ్ కి 'ఉరి' తర్వాత సరైన సక్సెస్ ఒక్కటి కూడా లేదు. చేతిలో ఛాన్సులైతే ఉంటున్నాయి?  గానీ చెప్పుకోదగ్గ విజయం ఎక్కడుందని భూతద్దం పెట్టి వెతికినా కనిపించడం లేదు. 'ఉరి' తర్వాత ఐదు సినిమాలు చేసింది. అన్ని రిలీజ్ అయ్యాయి వెళ్లాయి తప్ప! బాక్సాఫీస్ ని షేక్ చేసిన చిత్రం ఒక్కటీ లేదు. అలాగని ప్రస్తుతం ఏమైనా అవకాశాలు తగ్గాయనుకుంటే పొరబడిట్లే.అమ్మడు యధా విధిగా జెట్ స్పీడ్ తో కొత్త సినిమాలకు సంతకాలు చేస్తుంది. భారీగా అడ్వాన్సులు అందుకుంటుంది. సొగసరి బ్యూటీకి అవకాశాలే ఇంటికి వెతుక్కుంటూ వస్తున్నాయి.  త్వరలో 'లాస్ట్' అనే  సినిమాతో ప్రేక్షకుల ముదుకు రావడానికి రెడీ అవుతుంది. నేరుగా  ఓటీటీలోనే సినిమా రిలీజ్ అవుతుంది. ఇటీవలి కాలంలో హిందీ సినిమాలు ఎక్కువగా ఓటీటీలోనే రిలీజ్ అవుతున్నాయి.

భారీ లాభాలు ఆశించకుండా థియేటర్ రిలీజ్ తో నష్టం కన్నా వచ్చిన అర్ధరూపాయి లాభంగా భావించి వాటిలోనే సినిమాలు రిలీజ్ అయ్యేలా చూస్తున్నారు.  ఈ నేపథ్యంలో నే 'లాస్ట్' నిర్మాతలు ఓటీటీలో రిలీజ్ చేస్తున్నారు.

అనిరుద్ రాయ్  చౌదరి దర్శకత్వం వహించిన  ఈసినిమాలో యామీ క్రైమ్ రిపోర్టర్ పాత్రలో నటిస్తుంది.  నిజాన్ని వెతుక్కూంటు యామీ ప్రయాణం మొదలు పెడుతుంది.

ఆ ప్రయాణంలో   ఎదురైన అనుభవాల సమూహరామే చిత్ర కథగా తెలుస్తోంది. దీన్నిసస్పెన్స్ థ్రిల్లర్ గా మలిచినట్లు సమాచారం. ఈ సినిమాపై యామీ చాలా నమ్మకంగా  ఉంది.  హిట్ అందుకుని గెలుపు గుర్రమెక్కాలని  ఉవ్విళ్లూరుతుంది. సినిమాపై టీమ్ చాలా నమ్మకంతో ఉంది. ఇక అవకాశాల పరంగా యామీ చేతిలో ఇంకా మూడు ..నాలుగు సినిమాలున్నాయి.

'ఛోర్ నికల్ కే భాగ్.'.'ఓ మైగాడ్-2' చిత్రాల్లో నటిస్తోంది. మరో మూడు అగ్రిమెంట్లు రెడీగా ఉన్నాయట. మొత్తానికి యామీ దూకుడైతే యధావిధిగా కొనాసుగుందనే చెప్పాలి. విజయాలు లేకపోయినా అవకాశాలు అందుకుంటూ బాలీవుడ్ మీడియా అటెన్షన్ డ్రా చేస్తుంది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.