'స్టార్ హీరోయిన్ అయినా ఛాన్స్ కోసం లైంగిక వాంఛ తీర్చాల్సిందే'

Sun Sep 20 2020 18:30:08 GMT+0530 (IST)

'Even a star heroine has to satisfy her

బాలీవుడ్ యువ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మరణం తర్వాత ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ బాలీవుడ్ డార్క్ సీక్రెట్స్ ఒక్కొక్కటిగా వెల్లడిస్తూ వస్తోంది. బాలీవుడ్ లో నెపోటిజం ఫేవరిజం రాజ్యమేలుతోందని.. అవుట్ సైడర్స్ ని తొక్కేస్తారని.. స్టార్ కిడ్స్ కి టాలెంట్ తో సంబంధం లేకుండా అవకాశాలు ఇస్తారని ఆరోపిస్తూ బాలీవుడ్ ప్రముఖులపై ఓ రేంజ్ లో విరుచుకుపడింది. ఆ తర్వాత సుశాంత్ అనుమానాస్పద మృతి కేసులో వెలుగులోకి వచ్చిన డ్రగ్స్ వ్యవహారంపై స్పందించిన కంగనా రనౌత్ బాలీవుడ్ డర్టీ సీక్రెట్స్ అంటూ సంచలన విషయాలు వెల్లడించింది. బాలీవుడ్ లో డ్రగ్ మాఫియా ఉందని.. ఇండస్ట్రీలో దాదాపు 99 శాతం మంది డ్రగ్స్ తీసుకుంటారని.. అక్కడ డ్రగ్స్ లేకుండా పార్టీలు జరగవని.. నీళ్లలా డ్రగ్స్ తీసుకుంటారని కంగనా పేర్కొంది. ఈ క్రమంలో బాలీవుడ్ క్యాస్టింగ్ కౌచ్ పై స్పందిస్తూ సంచలన ఆరోపణలు చేసింది. బాలీవుడ్ సినిమాలో ఐటెమ్ సాంగ్ చేసే ఛాన్స్ రావాలన్నా.. రెండు నిమిషాల సీన్ లో నటించాలన్నా కూడా ఆ నటి హీరోతో గడపాల్సి ఉంటుందని చెప్పి అందరిని షాక్ కి గురి చేసింది. ఇప్పుడు తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన కంగన ఇండస్ట్రీలో జరుగుతున్న లైంగిక దోపిడీ గురించి వెల్లడించింది.కంగనా మాట్లాడుతూ.. బాలీవుడ్ లో నటీమణులపై లైంగిక వాంఛ తీర్చాలనే ఒత్తిడి ఎక్కువగా ఉంటుందని.. తాను ప్రత్యేకంగా ఏ ఒక్కరిని ఉద్దేశించి మాట్లాడటం లేదని.. ఇండస్ట్రీలోని పరిస్థితుల గురించి మాత్రమే తెలుపుతున్నానంటూ మరోసారి సంచలనం రేపింది. అక్కడ ఏ-లిస్ట్ బీ-లిస్ట్ అలాగే సూపర్ స్టార్స్ అందరూ నటీమణులు తమతో గడపాలని కోరుకుంటారని.. సెట్స్ లో కూడా తమకు భార్యలా నడుచుకోవాలని కోరుకుంటారని కామెంట్స్ చేసింది. సినిమాలు మారుతుంటే హీరోలు మారుతారే తప్ప పరిస్థితి మాత్రం అలాగే ఉంటుందని.. స్టార్ హీరోయిన్ అయినా ఛాన్స్ కోసం ఆ సినిమాకి కీలక వ్యక్తులకు లైంగికంగా లొంగిపోయి తృప్తి పరచనిదే పనికాదంటూ ఘాటు వ్యాఖ్యలు చేసింది కంగనా. ఇంతకముందు కంగనా ట్వీట్ చేస్తూ ఇండియాలో నెంబర్ వన్ ఇండస్ట్రీ టాలీవుడ్ అని ట్వీట్ చేసిన సంగతి తెలిసిందే. 'దేశంలో నెంబర్ వన్ సినీ ఇండస్ట్రీ బాలీవుడ్ అని అందరూ అనుకుంటారు. కానీ అది తప్పు. ప్రస్తుతం టాలీవుడ్ నెంబర్ వన్ ప్లేస్ కి వచ్చింది. రెగ్యులర్ గా పాన్ ఇండియా సినిమాలను నిర్మిస్తూ బాలీవుడ్ కు ఛాలెంజ్ విసురుతోంది' అని కామెంట్స్ చేసింది.