ఎన్టీఆర్ కూడా జెమిని స్థానం మార్చలేక పోయాడు

Thu Sep 16 2021 17:00:01 GMT+0530 (IST)

Even NTR could not change the position of Gemini

ప్రస్తుతం తెలుగు ఎంటర్ టైన్‌మెంట్ టీవీ ఛానెల్స్ లో టాప్ స్టార్ మా.. జీ తెలుగు.. ఈటీవీ. ఆ తర్వాత నాల్గవ స్థానంలో జెమిని టీవీ ఉంది. జెమిని టీవీని టాప్ 2 లేదా నెం.1 కు తీసుకు వచ్చేందుకు తీవ్ర ప్రయత్నాలు జరుగుతున్నాయి. జెమిని టీవీ వారు ఎన్టీఆర్ తో ఎవరు మీలో కోటీశ్వరులు షో ను ప్లాన్ చేశారు. ఆ షో తో ఖచ్చితంగా ఎన్టీఆర్ జెమిని టీవీ ర్యాంకింగ్ ను మార్చుతాడని అంతా నమ్మారు. కాని జెమిని టీవీ రేటింగ్ ఏం చేసినా మారే పరిస్థితి కనిపించడం లేదు. ఎవరు మీలో కోటీశ్వరులు మరియు తమన్నా మాస్టర్ చెఫ్ లు ప్రారంభం అయ్యి మూడు వారాలు పూర్తి చేసుకుని నాల్గవ వారంలోకి అడుగు పెట్టింది. అయినా కూడా ఇప్పటి వరకు జెమిని టీవీ ర్యాంకింగ్ లో కనీసం మార్పులు లేదు. కనీసం ఈటీవీని కూడా దాటలేక ఇంకా నాల్గవ స్థానంలోనే ఉందంటూ విశ్లేషకులు చెబుతున్నారు.చానల్స్ రేటింగ్ విషయంలో జెమిని టీవీ చాలా వెనుకబడి ఉంది. మరి కొన్ని వారాలు అయితే కాని రేటింగ్ పెరుగుతుందని కొందరు అంటూ ఉంటే మరి కొందరు మాత్రం స్టార్ మా మరియు జీ తెలుగు లు పోటా పోటీగా కార్యక్రమాలు చేస్తున్నాయి. పైగా స్టార్ మా వారు బిగ్ బాస్ ను ప్రతిష్టాత్మకంగా తీసుకుని నిర్వహిస్తున్నారు. కనుక బిగ్ బాస్ వల్ల స్టార్ మా నెం.1 గానే ఉంటుందని అంటున్నారు. ఇక జీ తెలుగు లో కూడా సీరియల్స్ మరియు షో ల వల్ల మంచి రేటింగ్ వస్తూనే ఉంది అంటున్నారు. ఈటీవీకి జబర్దస్త్.. ఢీ మరియు శ్రీదేవి డ్రామా కంపెనీలు వరంగా మారాయి. వాటి వల్ల భారీగా రేటింగ్ వచ్చి మూడవ స్థానంలో ఉంది. అందుకే జెమిని టీవీ ముందుకు రావాలంటే చాలా కష్టం అన్నట్లుగా టాక్ వినిపిస్తుంది.

ఎన్టీఆర్ నిర్వహిస్తున్న ఎవరు మీలో కోటీశ్వరులు షో కు మంచి రేటింగ్ వస్తున్నప్పటికి అది సరి పోవడం లేదని.. వారంలో నాలుగు రోజులు మాత్రమే ఆ షో వస్తుండటం వల్ల ఇతర ఛానల్స్ ను క్రాస్ చేయలేక పోతున్నట్లుగా చెబుతున్నారు. ఇదే సమయంలో ఎవరు మీలో కోటీశ్వరులు షో ఇతర ఛానెల్స్ షో కు పోటీగా రాకుండా సొంతంగా వస్తుంది. అంటే దాని వల్ల ఏ ఇతర ఛానెల్ యొక్క షో రేటింగ్ తగ్గలేదు. అందువల్ల కూడా జెమిని టీవీ రేటింగ్ ఇంకా నాల్గవ స్థానంలోనే ఉంది అంటూ నెటిజన్స్ కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.