Begin typing your search above and press return to search.

ఫస్ట్ లుక్: ఇటు శేష్.. అటు రెజీనా ఎవరు?

By:  Tupaki Desk   |   11 July 2019 2:30 PM GMT
ఫస్ట్ లుక్: ఇటు శేష్.. అటు రెజీనా ఎవరు?
X
 'క్షణం'.. 'గూఢచారి' చిత్రాలతో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న హీరో అడివి శేష్ తాజాగా 'ఎవరు' అనే సస్పెన్స్ థ్రిల్లర్ మూవీతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు.  ఈ సినిమా ప్రీ లుక్ ను రెండు రోజుల క్రితం విడుదల చేసిన సంగతి తెలిసిందే.  తాజాగా ఈ సినిమా ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేశారు.

ప్రీ లుక్ లో శేష్ ఒక పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటిస్తున్న సంగతిని.. ఈ సినిమాలో 'విక్రమ్ వాసుదేవ్' పాత్రలో నటిస్తున్న విషయాన్ని రివీల్ చేయడం జరిగింది.  తాజాగా రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్ లో వైట్ డ్రెస్ లో ఉన్న ఒక వ్యక్తి పగిలిన అద్దాన్ని రక్తం కారుతున్న చేత్తో పట్టుకొని ఉన్నారు. ఆ అద్దంలో రెజినా ప్రతిబింబం కనిపిస్తోంది.  అద్దం పట్టుకున్న వ్యక్తి రెజీనా లాగానే అనిపిస్తోంది.  నేపథ్యంలో శేష్ పోలీస్ యూనిఫామ్ లో జూమ్ అవుట్ లో మసగ్గా కనిపిస్తున్నాడు.  ఈ పోస్టర్ కు "అన్నీ సమాధానాలను ప్రశ్నించాల్సి ఉంటుంది" అంటూ క్యాప్షన్ ఇచ్చారు. అంటే ఏదో మర్డర్ మిస్టరీ.. దాని చుట్టూ జరిగే కథలాగా అనిపిస్తోంది.

ఈ సినిమాలో శేష్.. రెజీనాలతో పాటు మురళి శర్మ మరో కీలక పాత్రలో నటించాడు. ఈ చిత్రానికి సంగీతం అందించినవారు శ్రీచరణ్ పాకాల.  వెంకట్ రాంజీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని పీవీపీ సినిమాస్ బ్యానర్ పై నిర్మించారు. ఫస్ట్ లుక్ లో ఏమాత్రం స్టొరీ రివీల్ కానప్పటికీ ఇంటెన్స్ ఫీల్ కనిపిస్తోంది. మరి ఇది మరో 'క్షణం' అవుతుందో లేదో వేచి చూడాలి.