ఫోటో స్టోరి: టాప్ లేపేసిన శర్మా గాళ్

Tue Jul 07 2020 12:20:27 GMT+0530 (IST)

Esha Sharma Stunning Pose

ఈషా శర్మ.. ఇటీవల నెటిజనుల్లో వైరల్ గా దూసుకెళుతున్న బ్యూటీ ఈ అమ్మడు. నేహాశర్మ సోదరితో పాటు నిరంతరం ఫిట్ నెస్ వీడియోలు.. వేడెక్కించే బికినీ ఫోటోలతో చెలరేగడం ఈ భామ హ్యాబిట్ గా మారింది. అయితే ఐషాను స్టార్ హీరోయిన్ ని చేయడమే ధ్యేయంగా నేహాశర్మ వెన్నంటి నిలవడం ఇంట్రెస్టింగ్.సోదరి ప్రయత్నం సఫలమైంది. ప్రస్తుతం ఈషా శర్మ ఓ సినిమాకి కమిటైంది. ఇక కెరీర్ ఆరంభమే జాన్ అబ్రహం లాంటి స్టార్ సరసన సత్యమేవ జయతే లో అవకాశం అందుకుంది. జాన్ అబ్రహం సరసన ఈషా శర్మ.. మృణాల్ ఠాకూర్ నాయికలుగా నటించారు. ప్రస్తుతం బాలీవుడ్ లో జాన్ అబ్రహం పెద్ద హీరోల్లో ఒకరు. వరుస హిట్లతో తన స్థానాన్ని సుస్థిరం చేసుకోవడమే కాక.. విజయవంతమైన నిర్మాతగానూ పాపులరవుతున్నాడు. అతని రీసెంట్ సినిమాలు బాక్సాఫీస్ వద్ద వాణిజ్యపరంగా విజయవంతమయ్యాయి. అందుకే జాన్ ఇషాని ప్రమోట్ చేస్తున్నాడనే అభిమానులు భావిస్తున్నారు.

బాలీవుడ్ నటి నేహా శర్మ సోదరిగా సుపరిచితం అయినా తనంతట తానుగా ఎదిగేందుకు ప్రస్తుతం ప్రయత్నిస్తోంది. తదుపరి ఓ హిస్టారికల్ సినిమాలోనూ నటించనుందని తెలుస్తోంది.. ఇక ఇషా రెగ్యులర్ ఫోటో ట్రీట్ గురించి చెప్పాల్సిన పనే లేదు. తాజాగా ఈషా శర్మ షేర్ చేసిన ఓ బోల్డ్ ఫోటో అంతర్జాలంలో వైరల్ గా మారింది. బ్లూ డెనిమ్స్ .. వైట్ టాప్ లో టాప్ లేపింది ఈ బ్యూటీ.