స్టార్ కపుల్ పెళ్లికి మొత్తం టౌన్ నే బుక్ చేశారట

Mon Nov 29 2021 09:20:57 GMT+0530 (IST)

Entire town was booked for star couple wedding

బాలీవుడ్ మోస్ట్ క్రేజీ అండ్ బ్యూటీఫుల్ కపుల్ కత్రీనా కైఫ్ మరియు విక్కీ కౌశల్ ల వివాహంకు సంబంధించిన ఏర్పాట్లు చకచక జరుగుతున్నాయి. మీడియా వర్గాల్లో కొందరికి మాత్రమే ఇప్పటి వరకు ఈ పెళ్లి గురించిన సమాచారం అధికారికంగా అందింది. ఇక ఇండస్ట్రీ లో చాలా మందికి పెళ్లికి సంబంధించిన ఆహ్వానం అందింది.పెళ్లి మరి కొన్ని రోజులే ఉన్నా కూడా విక్కీ మరియు కత్రీనాలు ఇంకా కూడా తమ ప్రేమ విషయాన్ని అధికారికంగా బయటకు చెప్పడం లేదు. వారు డిసెంబర్ రెండవ వారంలో పెళ్లి పీఠలు ఎక్కబోతున్నారు. ఇప్పటికే అందుకు సంబంధించిన ఏర్పాట్లు జరుగుతున్నాయి. మొదట ముంబయిలో రిజిస్ట్రర్ మ్యారేజ్ ఉంటుంది. ఆ తర్వాత రాజస్తాన్ లో రణతంబోర్ అనే టౌన్ లో వివాహ వేడుక మూడు రోజుల పాటు జరుగబోతుందని అంటున్నారు.

బాలీవుడ్ నుండి సల్మాన్ షారుఖ్ సహా ఎంతో మంది ప్రముఖులు హాజరు కాబోతున్నారు. ఎక్కువ శాతం మంది ప్రముఖులు రెండు మూడు రోజులు అక్కడే బస చేయాల్సి ఉంటుందట. అందుకే రణతంబోర్ లోని దాదాపు అన్ని స్టార్ హోటల్స్ ను బుక్ చేశారట.

వారం రోజుల పాటు ఆ హోటల్స్ పూర్తిగా కత్రీనా అండ్ విక్కీ కౌశల్ ల వివాహం ను నిర్వహిస్తున్న ఆర్గనైజేషన్ వారి ఆధీనంలో ఉంటాయట. వచ్చే బంధు మిత్రులకు మరియు ఇండస్ట్రీ వర్గాల వారికి వారి హోదాను బట్టి హోటలను అరేంజ్ చేస్తారని తెలుస్తోంది. వీరి పెళ్లికి వేదిక అద్బుతంగా ముస్తాభవుతోంది. పెద్ద ఎత్తున ఈ వేడుక కు సంబంధించిన కొన్ని ఫొటోలు సోషల్ మీడియాలో లీక్ అయ్యాయి. అవి ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటున్నాయి.

సుదీర్ఘ కాలంగా ఇండస్ట్రీలో కొనసాగుతూ వస్తోన్న కత్రీనా కైఫ్ మొదట సల్మాన్ ఖాన్ తో ప్రేమలో ఉన్నట్లుగా వార్తలు వచ్చాయి. ఆ తర్వాత పలు పుకార్లు మీడియాలో వచ్చాయి. కాని చివరకు తన సోల్ మెట్ విక్కీ కౌశల్ అని ఆమె గ్రహించింది. విక్కీ కౌశల్ కూడా బాలీవుడ్ లో అనూహ్యంగా స్టార్ డమ్ దక్కించుకుని తన జీవితం కత్రీనాతో అని ఫిక్స్ అయ్యాడు.

అలా ఇద్దరు కూడా ఫిక్స్ అయ్యి పెళ్లికి సిద్దం అయ్యారు. ఈ పెళ్లికి కత్రీనా మాజీ ప్రియుడు అయిన సల్మాన్ ఖాన్ హాజరు అవ్వడం కన్ఫర్మ్ అయ్యిందని బాలీవుడ్ మీడియా వర్గాల వారు అంటున్నారు. వీరిద్దరు మాజీ ప్రియుడు ప్రేయసి అయినా కూడా ఇద్దరి మద్య స్నేహం కొనసాగుతోంది. ఇటీవల కూడా వీరిద్దరు కలిసి నటించారు. అందుకే కత్రీనా విక్కీల పెళ్లికి సల్లూ భాయ్ రాబోతున్నాడు.