టీజర్ టాక్: మంచోడే కానీ తాట తీస్తాడు!

Wed Oct 09 2019 18:47:18 GMT+0530 (IST)

Entha Manchivaadavuraa Teaser

నందమూరి కళ్యాణ్ రామ్ - వేగేశ్న సతీష్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న చిత్రం 'ఎంత మంచివాడవురా'. ఈ సినిమాలో కళ్యాణ్ రామ్ కు జోడీగా మెహ్రీన్ నటిస్తోంది.  సంక్రాంతి సీజన్లో ఈ సినిమాను రిలీజ్ చేసేందుకు ఫిలిం మేకర్స్ రెడీ అవుతున్నారు.  రీసెంట్ గా ఈ సినిమా టీజర్ ను విడుదల చేశారు.టీజర్  ఆరంభంలోనే మంచి వాళ్ళ గురించి చెప్తూ ఉంటారు.  "మా మనవడు శివ మంచోళ్ళకే మంచివాడు" అంటూ విజయ్ కుమార్ దంపతులు..  "నా కొడుకు ఆచార్య చాలా మంచివాడు" అని తనికెళ్ళ భరణి.. "మా అల్లుడు బాలు చాలా మంచోడు" అని సీనియర్ నరేష్.. "నా తమ్ముడు సూర్య ఎంత మంచోడో" అని మరోవ్యక్తి.. "నా అన్నయ్య రిషి చాలా మంచోడు" అని మరో అమ్మాయి.. "నా హీరో బాలు చాలా మంచోడు" అని మెహ్రీన్ వరసపెట్టి మంచి పురాణం చెప్తారు. అయితే కట్ షాట్స్ లో కళ్యాణ్ రామ్ రౌడీలను ఇరగదీస్తుంటాడు.   ఫ్రాంక్లీ టీఎన్నార్ తెలుసు కదా.. ఆయన వచ్చి "అందరూ మంచోడు మంచోడు అంటున్నారు.. మరి ఇలా కొడుతున్నావేంట్రా?" అని సంభ్రమాశ్చర్యాలు వ్యక్తం చేస్తాడు. "రాముడు కూడా మంచోడేరా.. అయితే రావణాసురుడ్ని ఏసెయ్యలా?" అంటూ కళ్యాణ్ రామ్ ప్రశ్న లాంటి బదులిస్తాడు.

దీనర్థం.. కళ్యాణ్ రామ్ మంచోడే కానీ తన సంచి ఎవరైనా లాక్కుంటే ఊరుకోడు.. తాట తీస్తాడు! పక్కనోళ్ళు మంచి అయితే మంచి.. లేకపోతే గట్టి పంచ్. అది వరస.  కళ్యాణ్ రామ్ పాత్ర ఇంట్రెస్టింగ్ గానే ఉంది.  మరి ఈ న్యూ జెనరేషన్ గుడ్ మ్యాన్ సంక్రాంతి పోటీని ఎలా తట్టుకుంటాడో వేచి చూడాలి. ఆలస్యం ఎందుకు.. ఈ మోడరన్ మంచివాడిని ఎక్కువ ఆలస్యం చేయకుండా చూసేయండి.