Begin typing your search above and press return to search.

ఆర్య‌-విశాల్ ENEMY లో గెలుపెవ‌రిది?

By:  Tupaki Desk   |   15 Oct 2021 6:55 AM GMT
ఆర్య‌-విశాల్  ENEMY లో గెలుపెవ‌రిది?
X
విశాల్-ఆర్య కాంబినేష‌న్ అంటే అంచ‌నాలు ఏ స్థాయిలో ఉంటాయో చెప్పాల్సిన ప‌నిలేదు. గ‌తంలో ఆ ఇద్ద‌రి కాంబినేష‌న్ లో తెర‌కెక్కిన `వాడు- వీడు` భారీ విజ‌యాన్ని అందుకుంది. త‌మిళం తెలుగులో విమ‌ర్శ‌కులు ప్ర‌శంస‌లు ద‌క్కించుకుంది. నాటి నుంచి విశాల్- ఆర్య క‌ల‌యిక అంటే ప్ర‌త్యేక‌మైన క్రేజ్ ఏర్ప‌డింది. తాజాగా త‌మిళ‌ స్టార్ హీరోలిద్ద‌రు క‌లిసి న‌టిస్తోన్న `ఎనిమీ` హాట్ టాపిక్ గా మారింది. టైటిల్ ప్ర‌క‌ట‌న‌తోనే ఇది భారీ యాక్ష‌న్ ఎంట‌ర్ టైన‌ర్ అని అర్థ‌మైంది. అటుపై రిలీజ్ అయిన పోస్ట‌ర్లు అంత‌కంత‌కు యాక్ష‌న్ ఎంట‌ర్ టైన‌ర్ పై వేడి పెంచాయి. విశాల్- ఆర్య ఇద్ద‌రు ప‌వ‌ర్ ఫుల్ యాక్ష‌న్ నేప‌థ్యంతో సాగే పాత్ర‌ల్లో క‌నిపించ‌నున్నారు.

ఎవ‌రు ఎవ‌రికి శ‌త్రువు? అన్న‌ది సినిమా చూస్తే గానీ క్లారిటీ రాదు. ఈ ప్ర‌పంచంలో అంద‌రికంటే పెద్ద శ‌త్రువు ప్రాణ స్నేహితుడేన‌ని చెప్పిన లైన్ ఎనిమీ క‌థ‌ను కాస్త రివీల్ చేస్తున్న‌ట్లు తెలుస్తోంది. దీన్ని విశాల్-ఆర్య మ‌ధ్య భీక‌ర యాక్ష‌న్ స‌న్నివేశాలతో మైండ్ గేమ్ నేప‌థ్యంలో ఓ రేంజ్ లో తెర‌కెక్కిస్తున్నార‌ని తెలుస్తోంది. బాలీవుడ్ లో తెర‌కెక్కిన బ్ర‌ద‌ర్స్ లాంటి సినిమాని త‌ల‌పించ‌డం ఖాయంగా క‌నిపిస్తోంది. పైగా ఆనంద్ శంక‌ర్ సినిమాలంటే కాస్త హాలీవుడ్..బాలీవుడ్ ట‌చ్ అప్ క‌నిపిస్తుంది. ఈ నేప‌థ్యంలో ఎనిమీ పై అంచ‌నాలు అంత‌కంత‌కు పెరిగిపోతున్నాయి. తాజాగా ద‌స‌రా శుభాకాంక్ష‌లు చెబుతూ `ఎనిమీ` కొత్త పోస్ట‌ర్ ని.. రిలీజ్ తేదీని కూడా ప్ర‌క‌టించారు.

దీపావ‌ళి సంద‌ర్భంగా న‌వంబ‌ర్ 4న చిత్రాన్ని రిలీజ్ చేస్తున్న‌ట్లు యూనిట్ వెల్ల‌డించింది. ఇక పోస్ట‌ర్ లో ఇద్ద‌రు ఇంటెన్స్ ఫేస్ ఆఫ్ లుక్ లో కనిపిస్తున్నారు. ఇద్ద‌రు ఒకరికొక‌రు త‌ల‌ప‌డుతున్న యాక్ష‌న్ సీన్ నుంచి పిక్ తీసుకున్న‌ట్లు తెలుస్తోంది. ఇద్ద‌రూ మంచి శ‌రీర‌సౌష్టవం క‌లిగిన హీరోలు. దీంతో ఇద్ద‌రి మ‌ధ్యా యాక్ష‌న్ స‌న్నివేశాలు పీక్స్ లో ఉంటాయ‌ని తెలుస్తోంది. వార్ సీన్స్ లో ఒకరికొక‌రు పోటీ ప‌డి న‌టించి ఉంటార‌నిపిస్తోంది. ఈ చిత్రానికి థ‌మ‌న్ సంగీతం అందిస్తున్నారు. మిని స్టూడియోస్-దివో మూవీస్ సంయుక్తంగా చిత్రాన్ని నిర్మిస్తున్నాయి.