భావోద్వేగాల ‘పంచతంత్రం’.. పోస్టర్ రిలీజ్ చేసిన యంగ్ హీరో!

Thu Apr 22 2021 19:00:01 GMT+0530 (IST)

Emotions Panchatantra Young Hero who released the poster!

ఎస్ ఒరిజినల్స్ టికెట్ ఫ్యాక్టరీ సంయుక్తంగా నిర్మిస్తున్న ‘పంచతంత్రం’. హర్ష పులిపాక తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో బ్రహ్మానందం సముద్రఖని కలర్స్ స్వాతి రాహుల్ విజయ్ నరేష్ అగస్త్య శివాత్మిక రాజశేఖర్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఫిబ్రవరిలోనే షూటింగ్ మొదలు పెట్టిన ఈ చిత్రానికి టైటిల్ ను రీసెంట్ గా ఫిక్స్ చేశారు. ఈ టైటిల్ పోస్టర్ ను టాలెంట్ యంగ్ హీరో అడవిశేషు ఆవిష్కరించారు.ఈ కార్యక్రమంలో నిర్మాత సృజన్ ఎరబోలు మాట్లాడుతూ.. ఇవాళ సాయంత్రం శివాత్మిక రాజశేఖర్ ఫస్ట్ లుక్ రిలీజ్ చేయబోతున్నట్టు చెప్పారు. ప్రస్తుతం షూటింగ్ శరవేగంగా జరుగుతోందని చెప్పారు. ‘కలర్ ఫొటో’ దర్శకుడు సందీప్ రాజ్ ఈ చిత్రానికి మాటలు అందిస్తున్నారని చాలా ఆనందంగా ఉందని అన్నారు.

ఈ చిత్రంతో దర్శకుడిగా ఇంట్రుడ్యూస్ అవుతున్న హర్ష పులిపాక మాట్లాడుతూ.. ప్రతీ జీవికి పంచేంద్రియాలు కీలకమైనవని వీటి చుట్టూనే తమ సినిమా కథను అల్లుకున్నట్టు చెప్పారు. చూపు వినికిడి స్పర్శ వాసన రుచి వంటి జ్ఞానేంద్రియాల చుట్టూ తమ సినిమా తిరుగుతుందని తెలిపారు. ఈ ఐదు భావోద్వేగాల చుట్టూ తిరుగుతూ.. యువత ఆలోచనలకు అద్దం పట్టేలా తమ చిత్రం ఉంటుందని అన్నారు.

అఖిలేష్ వర్ధన్ సృజన్ ఎరబోలు నిర్మాతలుగా వ్యవహరిస్తున్న ఈ చిత్రానికి ప్రశాంత్ ఆర్. విహారి సంగీతం సమకూరుస్తున్నారు. రమేష్ వీరగంధం రవళి కలంగి సహ నిర్మాతలుగా ఉన్నారు.