Begin typing your search above and press return to search.

ఏప్రిల్ లో మరీ ఇంత ఎమోషనా

By:  Tupaki Desk   |   19 April 2019 6:51 AM GMT
ఏప్రిల్ లో మరీ ఇంత ఎమోషనా
X
అదేంటో ఎన్నడూ లేనిది టాలీవుడ్ కు ఈ ఏప్రిల్ ఓ ప్రత్యేకతను సంతరించుకుంది. ఇప్పటిదాకా విడుదలైన మూడు సినిమాల్లో ఎమోషన్ కు పెద్ద పీఠ వేయడం అవి ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయ్యేలా ఉండటం మొత్తానికి వేసవిలో మంచు తాపంలా బాక్స్ ఆఫీస్ ని కళకళలాడుతు ఉండేలా చేశాయి. మొదట వచ్చిన మజిలీ సూపర్ హిట్ కావడానికి కారణం చైతు సామ్ ల మధ్య శివ నిర్వాణ ఏర్పరిచిన ఎమోషనల్ బాండింగ్ తో పాటు రావు రమేష్ పాత్రను డిజైన్ చేసిన తీరు అందరిని ఆకట్టుకుంది.

ఇక రెండో వారంలో విడుదలైన చిత్రలహరి కంటెంట్ మీద డివైడ్ టాక్ ఉన్నప్పటికీ ఓ నిరుద్యోగి వ్యధను చక్కని సంభాషణలతో ఫాదర్ సెంటిమెంట్ ని లింక్ చేసిన తీరు యూత్ కి కొద్దోగొప్పో కనెక్ట్ అయిపోయాయి. ఫలితంగా తక్కువ బిజినెస్ జరిగినప్పటికీ త్వరగానే బ్రేక్ ఈవెన్ చేరుకొని నిర్మాతలతో పాటు బయ్యర్లను ఒడ్డున పడేసిందని వసూళ్లు చెబుతున్నాయి

ఇక ఇవాళ వచ్చిన నాని జెర్సి ఈ రెండింటికి డబుల్ డోస్ తరహాలో అవుట్ అండ్ అవుట్ ఎమోషన్ తో హృదయాలను తాకుతోందని ఇందాక పూర్తయిన ప్రీమియర్ షో రిపోర్ట్. నాని కెరీర్ బెస్ట్ ఇచ్చాడని ఇంత చక్కని భావోద్వేగాలు ఈ మధ్యకాలంలో చూడలేదని ప్రేక్షకులు అంటున్నారు. ఏ రేంజ్ హిట్ అనేది చెప్పడం తొందపాటుతనం అవుతుంది కానీ మొత్తానికి జెర్సిలో ఊహించిన దాని కన్నా డబుల్ డోస్ ఎమోషన్ ఉందన్న ఫీడ్ బ్యాక్ అయితే వచ్చింది.

వచ్చే వారం రావాల్సిన సీత వాయిదా పడ్డట్టే. 26న వస్తున్న అవెంజర్స్ ఎండ్ గేమ్ సినిమాలో మ్యాటర్ ఏమో కానీ ఇదే చివరి భాగం కావడంతో అభిమానులు చాలా ఎమోషనల్ అవుతున్నారు. సూపర్ హీరోస్ అందరిని ఒకేసారి చూసే ఆఖరి పార్ట్ కావడంతో అంచనాలు మాములుగా లేవు. మొత్తానికి మూవీ లవర్స్ కి ఏప్రిల్ మొత్తం ఎమోషనల్ గడవడం చూస్తే ఆశ్చర్యం వేయక మానదు