ఫొటోటాక్‌ః బాబోయ్ ఏంటి ఎల్లీ ఈ ఫోజ్

Wed Apr 21 2021 10:00:01 GMT+0530 (IST)

Elli Avram? gorgeous pose

నా పేరు సూర్య చిత్రంలో తళుక్కున మెరిసిన ఎల్లి అవ్రామ్ ప్రస్తుతం నార్త్ ఇండియా సౌత్ ఇండియా అన్ని చోట్ల కూడా బిజీ బిజీగా నటిస్తోంది. ఐటెం సాంగ్ లకు బ్రాండ్ అంబాసిడర్ అన్నట్లుగా ఈ అమ్మడు వరుసగా సినిమాలకు కమిట్ అవుతోంది. ఈమె డాన్స్ జిమ్నాస్టిక్స్ ను మించి ఉంటుంది అంటూ సోషల్ మీడియా టాక్. నెట్టింట ఈమె షేర్ చేసే ఫొటోలు కొన్ని సార్లు నోరు వెళ్లబెట్టే విధంగా ఉంటాయి. తాజాగా ఈ అమ్మడు షేర్ చేసిన ఈ డాన్స్ ఫోజ్ కళ్లు పెద్దవి చేసి చూసేలా ఉంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇది ఒక డాన్స్ స్టెప్ అని కాకుండా జిమ్నాస్టిక్ అన్నట్లుగా ఉందంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.ఈ ఫొటోను షేర్ చేసిన ఎల్లి అవ్రామ్ తెల్లవారు జామున నాలుగు గంటల సమయంలో చల్లటి నీటిలో చేస్తున్న డాన్స్. ఆ సమయంలో తీసిన ఫొటో అంటూ పేర్కొంది. రెండు కాళ్లను సమాంతరంగా పెట్టి తల కిందుగా ఉన్న ఈ ఫోజ్ ఇండియన్ హీరోయిన్స్ మాత్రమే కాకుండా ఏ డాన్సర్ కు కూడా సాధ్యం కాకపోవచ్చు అంటున్నారు. అద్బుతమైన  ఈ అమ్మడి ఫోజ్ కు ప్రతి ఒక్కరు కూడా ఫిదా అవుతున్నారు. నా పేరు సూర్య తర్వాత తెలుగులో ఈమె మళ్లీ కనిపించలేదు. కాని తమిళం మరియు కన్నడ సినిమాలతో బిజీ అయ్యింది. హిందీలో ఈమె బుల్లి తెరపై కూడా సందడి చేస్తూ ఉంది. వెబ్ సిరీస్ ల్లో కూడా నటిస్తున్న ఎల్లీ అవ్రామ్ ఈ ఫోజ్ ఏ సినిమా కోసం ఇచ్చింది అనే విషయాన్ని మాత్రం తెలియజేయలేదు.