ఫోటో స్టోరీ: తెలుగందం.. ఏం తక్కువ?

Tue May 26 2020 21:00:01 GMT+0530 (IST)

Photo Story: Eesha Goes Pantless Flaunts Toned Legs

టాలీవుడ్ లో ఉన్న అచ్చతెలుగు భామ ఈషా రెబ్బా. ఈమధ్య ఈషా కెరీర్ నెమ్మదిగా సాగుతోంది. క్రేజీ ఆఫర్లేవీ చేతిలో లేవు. అయితే ఈషా ఏమాత్రం నిరాశచెందకుండా తన వైపు నుండి అన్ని ప్రయత్నాలు చేస్తోంది. టాలీవుడ్ లో ఎదిగేందుకు గ్లామరస్ గా కనిపించేందుకు పరాయి భాషల భామలకు పోటీ ఇచ్చేందుకు కూడా సై అంటోంది.ఇక సోషల్ మీడియాలో కూడా ఎంతో యాక్టివ్ గా ఉంటూ రెగ్యులర్ గా అప్డేట్స్ ఇస్తూ నెటిజన్లతో నిత్యం టచ్ లో ఉంటోంది. తాజాగా ఈషా తన ఇన్స్టా ఖాతా ద్వారా ఒక ఫోటో పోస్ట్ చేసింది. ఈ ఫోటోకు "కళ్ళలోనే ఉంది.. అంతా కళ్ళే" అంటూ క్యాప్షన్ ఇచ్చింది. ఈ ఫోటోలో ఒక వైట్ షర్టు ధరించిన ఈషా తన కళ్ళు హైలైట్ అయ్యేలా ఫోటో తీయించుకుంది.. అయితే సెకండ్ ఫోటోలో మాత్రం కాళ్ళు హైలైట్ అయ్యేలా ఫోటో తీయించుకుంది. అంటే కళ్ళు -కాళ్ళు గ్లామర్ పథకం అన్నమాట.

ఈ ఫోటోకు టాలీవుడ్ గూఢచారి అడివి శేష్ ఓ లైక్ వేసుకున్నాడు. ఒక నెటిజన్ "పాపా ప్యాంట్ ఇంట్లోనే మర్చిపోయావా" అంటూ ప్రశ్నించాడు. ఇక ఎంతో మంది ఫైర్ ఎమోజీలతో 'ఫైర్ ఫైర్స్ ది ఫైర్' అన్నట్టుగా ఈషా మంటలు పెడుతోందని చెప్పకనే చెప్పారు. ఇక ఈషా ఫ్యూచర్ ప్రాజెక్టుల సంగతి మాట్లాడుకుంటే 'లస్ట్ స్టోరీస్' వెబ్ సీరీస్ తెలుగు వెర్షన్ లో నటిస్తోంది.