ఫొటోటాక్ : మళ్లీ కన్ను తిప్పుకోకుండా చేసిన తెలుగమ్మాయి

Mon Oct 19 2020 09:45:11 GMT+0530 (IST)

Eesha Rebba Latest Stunning Pose

అందాల ఆరబోత విషయంలో ఎప్పటికప్పుడు ఉత్తరాది ముద్దుగుమ్మలతో పోటీ పడుతున్న తెలుగు ముద్దుగుమ్మ ఈషా రెబ్బా మరోసారి తన ఫాలోవర్స్ ను మంత్ర ముగ్దులను చేసింది. ఒక సెకను అలాగే తన ఫొటోల వంక చూస్తూ ఉండిపోయేలా ఈ ఫొటోలతో చేసింది అనడంలో ఎలాంటి సందేహం లేదు. రెగ్యులర్ గా ఈషా రెబ్బా ఫొటో షూట్ స్టిల్స్ ను షేర్ చేస్తూ వస్తున్న ఈషా రెబ్బా మరోసారి ఈ ఫొటోలను తన ఫాలోవర్స్ కోసం షేర్ చేసింది. ఈ ఫొటోల్లో చాలా క్యూట్ గా మరియు హాట్ గా ఈషా రెబ్బా ఉంది.నాభి అందం చూపించడంతో మంచి ఫేషియల్ ఎక్స్ ప్రెషన్ ను ఇచ్చి వావ్ అనిపించింది. హీరోయిన్ గా ఇప్పుడిప్పుడే అవకాశాలు దక్కించుకుంటున్న ఈషా రెబ్బా స్టార్ హీరోలను టార్గెట్ గా పెట్టుకుని కష్టపడుతోంది. అందాల ప్రదర్శణ విషయంలో రొమాంటిక్ సీన్స్ విషయంలో పక్క రాష్ట్రం హీరోయిన్స్ కు ఏమాత్రం తగ్గకుండా చేసేందుకు ఈ అమ్మడు రెడీగా ఉంది. కాని మన ఫిల్మ్ మేకర్స్ మాత్రం పొరుగింటి పుల్ల కూర అన్నట్లుగా ఈమెను పట్టించుకోకుండా పక్క రాష్ట్రం అమ్మాయిలకు స్టార్స్ కు పక్కన ఛాన్స్ ఇస్తున్నారు. ఎన్టీఆర్ సినిమా అరవింద సమేతలో నటించినా కూడా కూరలో కరివేపాకు అన్నట్లుగానే అందులో ఈషా పాత్ర ఉంది. కాని కొన్ని చిన్న సినిమాల్లో నటించి నటిగా మెప్పించడంతో పాటు హీరోయిన్ గా ఆకట్టుకుంది. ఈ ఫొటో షూట్స్ తో అయినా మన ఫిల్మ్ మేకర్స్ ఈ అమ్మడికి ఆఫర్లు ఇస్తారేమో చూడాలి.