ఫోటో స్టోరి: తెలుగమ్మాయి కిరాక్ ఫోజులే

Mon Aug 03 2020 09:30:56 GMT+0530 (IST)

Eesha Rebba Latest Stunning Pose

సోషల్ మీడియాల్లో తెలుగమ్మాయిల స్పీడ్ గురించి చెప్పాల్సిన పనే లేదు. సినీ సెలబ్రిటీలు.. టాప్ మోడల్స్ కి ఏమాత్రం తీసిపోవడం లేదు. మారు మూల మగువలు సైతం ఇక్కడ సెలబ్రిటీలు అయిపోతున్నారు. ఈ ట్రెండ్ ఇటీవల అంతకంతకు వేడెక్కిస్తోంది. ఇన్ స్టా ట్విట్టర్ సహా సోషల్ మీడియాల్లో ఆదాయ ఆర్జనకు ఉన్న ఆస్కారాన్ని ఒడిసి పట్టాలన్నదే ప్రతి ఒక్కరి తపన. టిక్ టాక్ బ్యాన్ లాంటి అరుదైన ఘటనలు ఝలక్ ఇచ్చినా కానీ ఇన్ స్టా వేదికపై చెలరేగేవారు ఏమాత్రం తగ్గడం లేదు.టాలీవుడ్ పాపులర్ ఫేస్ లకు సోషల్ మీడియాల్లో బాగా వర్కవుటవుతోంది. ముఖ్యంగా తెలుగమ్మాయిలు ఎక్కడా తగ్గడం లేదు. హైదరాబాదీ అమ్మాయి ఇషా రెబ్బా సోషల్ మీడియాల్లో ఎంత స్పీడ్ గా ఉంటుందో తెలిసిందే. ఇటీవల ఇషా బోల్డ్ స్టేట్ మెంట్స్ సహా బోల్డ్ ఫోటోలపై ఆసక్తికర చర్చ సాగుతోంది. ఓ అంచనా ప్రకారం సోషల్ మీడియాలో ఇషాకు ఉన్న ఫాలోయింగ్ దృష్ట్యా పలు బ్రాండ్లు తనకు లక్షల్లో చెల్లించి పబ్లిసిటీ చేయించుకునేందుకు వెనకాడడం లేదు. ఆ సంగతి ఇషా రెబ్బా ఇన్ స్టా మాధ్యమం పరిశీలిస్తే అర్థమవుతుంది.

బ్రాండింగ్ ఆఫర్లను కాపాడుకునేందుకు ఇషా రకరకాల ఎత్తుగడలు వేస్తోంది. రెగ్యులర్ గా ఫోటోలు వీడియోలు షేర్ చేస్తూ ఇన్ స్టా ఫాలోవర్స్ ని పెంచుకుంటోంది. తాజాగా ఇషా షేర్ చేసిన ఓ ఫోటో అంతే వైరల్ గా మారింది. తెలుగమ్మాయి కిర్రాక్ ఫోజులే... ఆ ఫోటో తీసే భాగ్యం నాకే ఎందుకు కలగలేదు! అంటూ వాపోయాడంటే అర్థం చేసుకోవచ్చు. ఇషా అలా థై సొగసును ఎలివేట్ చేస్తోంది మరి. ఆ కుడి మోచేతిపై నెమలి పించం టాట్టూ మతి చెడాల్సిందే. సండే వైబ్స్ కిరాక్ అంటూ స్పందిస్తోంది యూత్. కెరీర్ పరంగా చూస్తే.. ఎన్టీఆర్ అరవింద సమేత చిత్రంలో ఇషా ఇంపార్టెంట్ రోల్ చేసింది. ఆ తర్వాత రాగల 24 గంటల్లో  చిత్రంలో సోలో నాయికగా కనిపించింది.  మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ లో ఇషా ఆసక్తికర పాత్రలో నటిస్తోంది. ఎస్.ఆర్.కే అనే కన్నడ చిత్రం సహా తమిళంలో ఓ సినిమా చేస్తోంది.