ఫొటోటాక్ : అమ్మడి అందం రోజు రోజుకూ పెరుగుతోంది

Wed Nov 24 2021 06:00:01 GMT+0530 (IST)

Eesha Rebba Latest Photo

తెలుగమ్మాయి ఈషా రెబ్బ హీరోయిన్ గా వరుసగా సినిమాల్లో నటిస్తూ ఉత్తరాది ముద్దుగుమ్మలకు పోటీ ఇచ్చేలా అందాల ప్రదర్శణ చేస్తోంది. హీరోయిన్ గానే కాకుండా క్యారెక్టర్ ఆర్టిస్టుగా కూడా సినిమాలు చేస్తూ వస్తున్న ఈ అమ్మడు వెబ్ సిరీస్ లు మరియు వెబ్ మూవీస్ ను కూడా చేస్తూ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. స్టార్ హీరోలకు జోడీగా నటించే అవకాశాలు రాకున్నా ఈమె ఇండస్ట్రీలో ఇతర హీరోల సినిమాల్లో నటిస్తూ ఆకట్టుకుంటూ ఉంది. ఐటెం సాంగ్ తో పాటు హాట్ షో కూడా చేస్తూ ఈ అమ్మడు టాలీవుడ్ ప్రేక్షకుల అభిమానంను దక్కించుకుంది.ఉత్తరాది ముద్దుగుమ్మల స్థాయిలో అందాల ప్రదర్శణ చేస్తూ.. మంచి నటన ప్రతిభ ఉన్నా కూడా ఈమెకు స్టార్ హీరోల సినిమాల్లో మాత్రం ఆఫర్లు ఇవ్వడం లేదు. స్టార్ హీరోయిన్ మెటీరియల్ అయినా కూడా ఈమెకు ఆశించిన స్థాయిలో ఆఫర్లు రావడం లేదు అనేది చాలా మంది వాదన. ఈ విషయంను ఆమె అభిమానులు పదే పదే ఇలాంటి క్యూట్ హాట్ ఫొటోలు షేర్ చేసిన సమయంలో అంటూ ఉంటారు. అమ్మడి అందంతో పాటు ఆకట్టుకునే రూపం ఉన్నా కూడా ఎందుకు ఇలా వృదాగా ఆమె అందం పోతుందని అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఈషారెబ్బ తెలుగు లోనే కాకుండా ఇతర భాషల నుండి కూడా ఆఫర్లు దక్కించుకుంటుంది. ముందు ముందు తెలుగు లో కాకున్నా కూడా ఇతర భాషల్లో అయినా ఈమెకు స్టార్ దక్కుతుందేమో చూడాలి. నెట్టింట ఈమె ఫొటోలు రెగ్యులర్ గా వైరల్ అవుతూనే ఉన్నాయి. తాజాగా మరోసారి ఈమె ఫొటోలు నెటిజన్స్ తెగ షేర్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈషా రెబ్బ ఒక వెబ్ సిరీస్ తో పాటు రెండు చిన్న సినిమాల్లో నటిస్తోంది. మరి కొన్ని చర్చల దశలో ఉన్నాయి. వచ్చే ఏడాది ఆమె నుండి పలు ప్రాజెక్ట్ లు వచ్చే అవకాశం ఉందంటున్నారు.