తెలుగమ్మాయికి రాగల 24 గంటల్లో టెన్షన్ టెన్షన్

Mon Nov 18 2019 14:36:43 GMT+0530 (IST)

Eesha Rebba Hopes on about Ragala 24 Gantallo Movie

తెలుగు అమ్మాయిలు ఎంత అందంగా ఉన్నా.. నటనలో ఎంతగా ప్రతిభ చూపించినా కూడా సెకండ్ క్లాస్ హీరోయిన్ గానే పరిగణిస్తున్నారు. చిన్న సినిమాల్లో హీరోయిన్స్ గా.. పెద్ద సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్టులుగా మాత్రమే తెలుగు అమ్మాయిలు కనిపిస్తున్నారు. అయితే ఈమద్య కాలంలో ఈషా రెబ్బ కాస్త ఎక్కువగా ప్రముఖంగా కనిపిస్తోంది. ఈమెకు స్టార్ హీరోల సరసన నటించే ఫీచర్స్ ఉన్నాయని త్వరలోనే ఈ అమ్మడికి స్టార్స్ నుండి పిలుపు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయంటూ అభిప్రాయం వ్యక్తం అవుతుంది.ఇప్పటి వరకు ఈషా నటించిన సినిమాలతో మంచి గుర్తింపు దక్కించుకుంది. అయితే ఒక పూర్తి స్థాయి కమర్షియల్ హీరోయిన్ గా మాత్రం ఆమెకు గుర్తింపు రావడం లేదు. ఇటీవల ఈమె 'రాగల 24 గంటల్లో' అనే చిత్రంలో నటించింది. ఈనెల 22న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ చిత్రంపై ఈషా చాలా ఆశలు పెట్టుకుంది. సస్పెన్స్ థ్రిల్లర్ గా రూపొందిన ఈ చిత్రంలో ఈషా నటనకు ప్రాముఖ్యత ఉన్న హీరోయిన్ గా నటించింది. ఈ చిత్రంతో ఈషా నటిగా నిరూపించుకునేందుకు సిద్దం అయ్యింది. ఈ చిత్రం విడుదల నేపథ్యంలో ఈషా టెన్షన్ గా ఉన్నట్లుగా సమాచారం.

ఇప్పటికే సోషల్ మీడియాలో తన హాట్ ఫొటో షూట్ ను పోస్ట్ చేస్తూ వచ్చిన ముద్దుగుమ్మ ఈషా ఉత్తరాది ముద్దుగుమ్మలకు ఏమాత్రం తీసిపోను అంటూ నిరూపించింది. ఇక ఇప్పుడు ఈ అమ్మడు తన కొత్త సినిమాతో నటిగాను సత్తా చాటబోతుంది. ఈ చిత్రం తర్వాత ఈషా రెబ్బ కెరీర్ టర్న్ అవుతుందేమో చూడాలి. రాగల 24 గంటల్లో ఈషాకు రాగల రోజుల్లో ఎలాంటి సినిమా అవకాశాలను తెచ్చి పెడుతుందా అంటూ అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.