ఫోటో స్టొరీ: అచ్చ తెలుగు అందాల దేవత

Sun Sep 15 2019 16:35:57 GMT+0530 (IST)

నిజాలు నిష్టూరంగా ఉంటాయి.  ఎవరైనా ఫ్లూయంట్ ఇంగ్లీష్ లో మాట్లాడితే మనం "అబ్బ..ఏం మాట్లాడుతున్నారో" అని ఆరాధనగా చూస్తాం. అదే ఒక వ్యక్తి కనుక స్వచ్చమైన తెలుగులో స్పష్టమైన ఉచ్చారణతో మాట్లాడాడు అనుకోండి.. వాడిని ఓ వింతమనిషిని చూసినట్టు చూస్తాం. అదేంటో మరి. తెలుగువారు ఈ ఒక్క విషయంలో మాత్రం తప్పకండా మారాల్సిన అవసరముంది.  ఇంగ్లీషు మాట్లాడితే గొప్పే.. తెలుగు స్పష్టంగా మాట్లాడితే కూడా ఇంకా గొప్ప!అయినా ఈ టాపిక్ ఎందుకు వచ్చింది అంటే మన తెలుగు హీరోయిన్ల పరిస్థితి కూడా అంతే. పొరపాటున తెలుగు అమ్మాయి అని తెలిస్తే చాలు.. వచ్చే ఆఫర్లు కూడా తుర్రుమని కిటికీలోనుంచి పారిపోతాయి. ఇలాంటి పరిస్థితులలో హీరోయిన్ గా నెట్టుకొస్తున్న అచ్చ తెలుగు భామా ఈషా రెబ్బా. ఈ వరంగల్ బ్యూటీ సోషల్ మీడియాలో యాక్టివ్ గానే ఉంటుంది.  తాజాగా ఒక ఫోటో పోస్ట్ చేసింది. పసుపు రంగు ఛోళి.. లెహెంగా.. చున్నీతో సూపర్ పోజులిచ్చింది. పర్ఫెక్ట్ గా మేకప్.. మెడలోవైట్ కలర్ నెక్లెస్.. చేతులకు గాజులు.. అన్నీ కరెక్ట్ గా మ్యాచ్ అయ్యాయి. ఎలా ఉందో తెలుగులో ఒక్కముక్కలో చెప్పాలంటే.. భేష్.

ఇక మన తెలుగు నెటిజన్లు రెచ్చిపోయారు.  "అందానికే అసూయ కలిగించే అందం మీది. బ్యూటిఫుల్" అంటూ ఒక నెటిజన్ ప్రశంసించాడు. "అయినా ఏంజెల్స్ కు భూమి మీద ఏం పని?" అంటూ మరో నెటిజన్ ప్రశించాడు.  "రోజురోజుకూ గ్లామర్ పెరిగిపోతోంది.. ఏంటి సీక్రెట్"అంటూ ఇంకో నెటిజెన్ అనుమానం వ్యక్తం చేశాడు.  ఇక ఈషా ఫ్యూచర్ ప్రాజెక్టుల సంగతి మాట్లాడుకుంటే శ్రీనివాస్ రెడ్డి దర్శకత్వంలో 'రాగల 24 గంటల్లో' అనే చిత్రంలో నటిస్తోంది.  ఈ సినిమాతో పాటుగా ఒక తమిళ మూవీలోనూ.. మరో కన్నడ సినిమాలోనూ నటిస్తోంది.