ఫోటో స్టొరీ: తెలుగు ఘాటు ఇలా ఉంటుంది

Tue Apr 23 2019 14:46:19 GMT+0530 (IST)

Eesha Rebba Glamorous Poses

ఈషా రెబ్బా పేరు దాదాపు తెలుగు ప్రేక్షకులకు పరిచయమే.  ఈషా రెబ్బా కెరీర్ మొదట్లో కొన్ని విజయవంతమైన చిత్రాలలో నటించినా ఈమధ్య మాత్రం స్లో అయిపోయింది.  ఈషా లాస్ట్ సినిమా సుమంత్ హీరోగా నటించిన 'సుబ్రహ్మణ్యపురం'.  ఆ సినిమా తర్వాత ఇంకా ఈషాకు చెప్పుకోదగ్గ ఆఫర్ రాలేదు. అచ్చతెలుగు భామ కావడంతో పెద్దగా ఆఫర్లు రావడం లేదు కానీ అదే ఈషా రెబ్బా ముంబై లేదా కన్నడ భామ అయి ఉంటే ఈపాటికి ఆఫర్లు వద్దన్నా వచ్చేవి. ఏం చేస్తాం తెలుగుభామ కదా.. సర్దుకుపోతోంది.అయితే అవకాశాల కోసం తన వంతు ప్రయత్నాలు మాత్రం మానడం లేదు.  పరాయి భాషల భామలకు పోటీ ఇచ్చేలా సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటోంది.  అప్పుడప్పుడూ గ్లామరస్ ఫోటో షూట్లు చేస్తోంది. తాజాగా ఈషా ఒక హాట్ ఫోటో షూట్ చేసింది. డిజైనర్ డ్రెస్ ధరించి తన అందాలను ఆరబోసింది.  పొడవాటి చేతులు ఉండే ఛోళీ.. పూల డిజైన్ ఉండే లెహెంగాలో నెటిజనుల మతిపోయేలా పోజులిచ్చింది. క్లీవేజ్ షోతో పాటుగా నాభి సౌందర్యాన్ని కూడా ప్రదర్శిస్తూ సెక్సీ ఎక్స్ ప్రెషన్స్ ఇచ్చింది. చున్నీని మెడకు స్టైల్ గా చుట్టింది. ఇక హెయిర్ స్టైలింగ్ కూడా అదిరిపోయింది.

గతంలో కూడా ఈషా గ్లామరస్ ఫోటో షూట్లు చేసింది కానీ ఈ రేంజ్ లో ఉత్తరాది భామలతో పోటీకి సై అన్నట్టుగా తనలోనే ఘాటు-నెస్ ను బయటకు తీయడం మాత్రం ఇదే మొదటి సారి.  ఆఫర్లు ఇవ్వకుండా ఉండేసరికి తిక్కరేగిందేమో.  ఇలానే కంటిన్యూ అయితే ఈషా మరింతగా జోరు పెంచడం ఖాయం.  అప్పుడు  'తెలుగు అమ్మాయి అయి ఉండి ఏంటి ఈ దూకుడు?' అని ఎవరు నొసలు చిట్లించినా లాభం ఉండదు.