అందాలు హాయ్ రబ్బా .. ఈషా రెబ్బా

Mon Feb 22 2021 08:00:01 GMT+0530 (IST)

Eesha Rebba Glamorous Pose

ఈ మధ్యకాలంలో తెలుగులో తెలుగు హీరోయిన్స్ రాణించిన సందర్భాలు చాలా తక్కువ. స్వాతి రెడ్డి .. అంజలి .. అభినయ వంటి కొంతమంది అమ్మాయిలు గట్టిగానే ప్రయత్నించినప్పటికీ వాళ్లు తెలుగులో కంటే తమిళంలోనే ఎక్కువ క్రేజ్ ను సంపాదించుకున్నారు.  మలయాళ బ్యూటీలను .. ముంబై భామల పోటీని వాళ్లు తట్టుకుని నిలబడటం చాలా కష్టమే అయింది. అయినా ఒక రకంగా వాళ్లు తమ సత్తాను చాటారనే చెప్పుకోవాలి. ఇక ఈషా రెబ్బా కూడా అచ్చ తెలుగు అమ్మాయే. ఈ వరంగల్ పిల్ల కూడా తెలుగు తెరను గట్టిగానే పట్టేసింది.'లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్' సినిమా ద్వారా తెలుగు తెరకి పరిచయమైన ఈ సుందరిని ఆరంభంలో దర్శక నిర్మాతలు అంతగా పట్టించుకోలేదు. కానీ ఈ అమ్మాయి కనుముక్కుతీరు బాగుందనీ ఆమెలో మంచి ఆకర్షణ ఉందనే టాక్ వచ్చింది. అయితే పెద్ద సినిమాల్లో ఆమెకి అవకాశాలు దక్కకపోవడం .. ఆమె చేసిన చిన్న సినిమాలు ఆడకపోవడం వలన కాస్త వెనుకబడిపోయింది. అయితే ఈషా రెబ్బా డీలాపడిపోలేదు .. ఇక్కడ కష్టమని చెప్పేసి వేరే భాషలకి పరికిగెత్తలేదు. తనని తాను ఓ అందమైన శిల్పంలా తీర్చిదిద్దుకుంటూ వచ్చింది.

గతంలోని ఈషా రెబ్బకి .. ఇప్పటి ఈషా రెబ్బకి చాలా తేడా తెలుస్తుంది. బంగారానికైనా మెరుగుపెట్టాలి .. వజ్రానికైనా సానపట్టాలి అన్నట్టుగా ఆమె అందం రెట్టింపు అవుతూ వచ్చింది. ఈ పిల్ల కూడా మరీ అమాయకత్వానికి పోకుండా సోషల్ మీడియా ద్వారా కుర్రకారును వేడిక్కించడంలో ఇతర హీరోయిన్లకి గట్టిపోటీనే ఇస్తోంది. తాజాగా ఈషా రెబ్బా పోస్ట్ చేసిన ఫొటో చూస్తే ఈ అమ్మాయి అందాల గని .. సౌందర్య నిధి అనిపించకమానదు. మనిషి కాస్త రంగుతేలి .. మామిడిపండు మాదిరిగానే ఉంది. కుర్రాళ్లంతా ఆమె కాటుక కళ్లకు కట్టుబడిపోతున్నారు .. కెంపుల్లాంటి ఆమె పెదాల ఒంపులకు పట్టుబడిపోతున్నారు. హాటు లుక్కులతో ఈ బ్యూటీ తన రూటును .. ఫేటును కూడా మార్చుకునేలానే ఉంది.