Begin typing your search above and press return to search.

ఫోజులతో కంగారు పెట్టించిన హాట్ సుందరి

By:  Tupaki Desk   |   9 April 2020 4:30 AM GMT
ఫోజులతో కంగారు పెట్టించిన హాట్ సుందరి
X
ఇషా గుప్తా.. అందాల ఆరబోత విషయంలో బాలీవుడ్ ఇండస్ట్రీలో ఎల్లప్పుడూ సంచలనమే. హాలీవుడ్ స్టార్ ఏంజలీనా పోలికతో ఉండే ఈ బ్యూటీ తన సెక్సీ నెస్‌తో సెగలు రేపుతోంది. మిస్ ఇండియా పోటీల్లో పాల్గొన్న ఇషా గుప్తా మిస్ ఫోటోజెనిక్ అవార్డు గెలచుకుంది. ఇమ్రాన్ హస్మి హీరోగా వచ్చిన ‘జన్నత్-2' చిత్రం ద్వారా బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. సెక్సీ ఫిగర్ కలిగి ఉండటంతో తొలి సినిమాతోనే అందం పరంగా అందరి చూపులను ఆకట్టుకుంది. అంతే కాకుండా మోస్ట్ డిజైరబుల్ ఉమెన్‌ గా కంట్రీలో మోస్ట్ హాటెస్ట్ గర్ల్‌ గా గుర్తింపు తెచ్చుకుంది. ఢిల్లీలో పుట్టి పెరిగిన ఈ భామ మణిపాల్ ఇన్ స్టిట్యూట్ నుండి పట్టాను పొందింది. కింగ్ ఫిషర్ కేలండర్‌ తో పాటు ప్రముఖ లీడింగ్ మేగజైన్ల కోసం హాట్ అండ్ సెక్సీగా ఫోటోలకు ఫోజులు ఇచ్చింది ఇషా.

ప్రస్తుతం సినిమా అవకాశాలు లేక ఖాళీగా ఉంటుందట. అయితే ఇప్పుడు కరోనా కారణంగా లాక్ డౌన్ విధించడంతో ఇంటికే పరిమితమయ్యింది ఈ సుందరి. ఎలాంటి కాస్ట్యూమ్ కైనా పర్ఫెక్టుగా ఫిట్ అయ్యే టోన్డ్ బాడీ ఉండటంతో ఆమె అందాలకు మరింత గుర్తింపు వచ్చింది. మహేష్ భట్ 'జన్నత్ 2' సినిమాతో వెండితెరకు పరిచయమై చేసింది తక్కువ సినిమాలే అయినా ఫ్యాన్ ఫాలోయింగ్ మాత్రం విపరీతంగా పెంచుకుంది. కానీ అమ్మడు ఫ్యాన్స్ ని మాత్రం ఏదో విధంగా సోషల్ మీడియాలో అలరిస్తుంది. ఈ మధ్య కొన్ని ఫోజులతో అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తుంది. అదేంటంటే యోగా ఆసనాలతో.. ఇషా యోగా చేస్తున్న ఫోటోలు తాజాగా ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది. ఆ ఫోటోలు చూసి అందరూ ఇషా ఎముకలు ఉన్నాయా విరిగాయా.. అనే సందేహాలను వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ఆ విధంగా ఉన్నాయి సుందరి భంగిమలు. ప్రస్తుతం ఆ ఫోటోలు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి.