Begin typing your search above and press return to search.

టీజర్ టాక్: ఏదేదో జరిగింది

By:  Tupaki Desk   |   22 April 2019 7:30 AM GMT
టీజర్ టాక్: ఏదేదో జరిగింది
X
ఇటీవలి కాలంలో చిన్న సినిమాలు తమ ఉనికిని చాటుకునే ప్రయత్నం గట్టిగానే చేస్తున్నాయి. రొటీన్ గా వెళ్తే లాభం లేదని ఏదో ఒక ఎలిమెంట్ ఆసక్తిగా ఉండేలా చూసుకుంటున్నారు. అలాంటిదే మరో సినిమా ఏదైనా జరగొచ్చు. టైటిల్ లోనే ఇదేదో వెరైటీ థ్రిల్లర్ అనే ఇంప్రెషన్ కలిగించిన దర్శక నిర్మాతలు టీజర్ లో కూడా అదే చూపించే ప్రయత్నం చేశారు.

ముగ్గురు కుర్రాళ్ళు(విజయరాజ- రాఘవ- రవి శివతేజ) అనుకోకుండా ఓ పద్మవ్యూహంలో ఇరుక్కుంటారు. తమకు తెలియకుండానే నేర సామ్రాజ్యంలోకి అడుగు పెడతారు. అంతే ఇక అక్కడి నుంచి వీళ్ళను వెంటాడుతూ కొన్ని గ్యాంగులు బయలుదేరతాయి. అసలు వీళ్ళు చేసిన తప్పేంటి తింగరి వెధవలు అనిపించుకునే కుర్రాళ్ళు ఇంత పెద్ద క్రైమ్ వరల్డ్ లో ఎలా ఇరుకున్నారు అనేదే కథగా తోస్తోంది

టీజర్ చాలా హడావిడిగా చుట్టేశారు. ప్లాట్ రివీల్ కాకూడదు అనే ఉద్దేశంతోనో లేక స్టొరీ అర్థం కాకూడదనే ప్లానో తెలియలేదు కాని మొత్తానికి ఏదో జరిగింది టీజర్ ఏదో ఉందిలే అనే ఫీలింగ్ కలిగిస్తుంది. శ్రీకాంత్ పెండ్యాల సంగీతం అందించిన ఈ మూవీకి కె రమాకాంత్ దర్శకుడు. యాక్టర్స్ ని పెద్దగా రివీల్ చేయలేదు.

టీజర్ చివరి ఫ్రేమ్ లో నాగబాబు ఎంట్రీ తప్ప ఇంకే సీనియర్ స్టార్ క్యాస్ట్ ఇందులో కనిపించలేదు. కాన్సెప్ట్ అంత కన్ఫ్యుజింగ్ గా చూపించారు కాబట్టి ఎక్కువ చెప్పే అవకాశం లేకపోయింది. ఈ ఏదైనా జరగొచ్చు సినిమాలో ఏం జరిగిందో తెలియాలంటే ముందు విడుదల జరిగి ధియేటర్లలోకి వచ్చాక అప్పుడు తెలుస్తుంది