Begin typing your search above and press return to search.

ఈసారైనా హ‌ను ఆ త‌ప్పు చేయ‌డు క‌దా!

By:  Tupaki Desk   |   29 July 2020 11:30 PM GMT
ఈసారైనా హ‌ను ఆ త‌ప్పు చేయ‌డు క‌దా!
X
ఎక్కడ త‌ప్పు జ‌రుగుతోందో తెలుసుకుంటే ఆ త‌ప్పును రిపీట్ కాకుండా ఆపొచ్చు. కానీ ఈ విష‌యంలో స‌రిగా విశ్లేషించుకోక ప‌రాజ‌యాలు రిపీట‌య్యాయి హ‌నూ రాఘ‌వ‌పూడికి. చ‌క్క‌ని ప్రేమ‌క‌థ‌ల్ని ఎంచుకుని సినిమాలు తీస్తాడు. కానీ కొన్ని త‌ప్పులు చేసి దొరికిపోతాడు. ఫ‌స్టాఫ్ బాగా తీసినా సెకండాఫ్ లో త‌ప్పులు చేస్తాడ‌న్న అపప్ర‌ద అత‌డిపై ఉంది.

హను రాఘవపూడి ఏదో ట్రై చేయాలని చూస్తాడు..! కానీ క్లారిటీ లేక కన్ఫ్యూషన్లో ప్లాప్స్ ఇస్తుంటాడు..! అన్న‌ది క్రిటిక్స్ వెర్షన్. మంచి క‌థ‌ల్ని ఎంచుకోవ‌డమే కాదు.. క‌థ‌నంలో మిస్టేక్స్ జ‌ర‌గ‌కుండా జాగ్ర‌త్త ప‌డాల‌ని క్రిటిక్స్ సూచిస్తుంటారు. అయితే అది రిపీట్ కాద‌ని ఈసారైనా నిరూపిస్తాడా?

ఇప్పుడు దుల్కర్ సల్మాన్ తో ఏదో సినిమా చేయాలని ట్రై చేస్తున్నాడు..! నానీకి చాలా కాలం క్రితం ఇదే స్క్రిప్టును వినిపించాడు. అత‌డితో చేయాల్సిన సినిమా ఇది. కానీ కుద‌ర‌క‌ దుల్క‌ర్ తో చేస్తున్నాడు. 1964లో జ‌రిగిన ఒక ప్రేమ‌క‌థ‌ను హ‌ను తెర‌పై చూపించ‌బోతున్నాడు. ఇందులో లీట‌నెంట్ రామ్ అనే ఆర్మీ మ్యాన్ పాత్ర‌లో దుల్కార్ స‌ల్మాన్ న‌టిస్తున్నాడు. `యుద్ధంతో రాసిన ప్రేమ‌క‌థ` అని క్యాప్ష‌న్ ఇచ్చారు కాబ‌ట్టి ఆర్మీ మేన్ గా ప్రేమికుడిగా దుల్కార్ న‌టిస్తున్నాడ‌ని అర్థ‌మ‌వుతోంది. ఈసారైనా హ‌ను స‌క్సెస్ సాధిస్తాడా? త‌ప్పుల్ని రిపీట్ చేయ‌కుండా ఆశించిన హిట్టు కొడ‌తాడా? అన్న‌ది చూడాలి. వైజ‌యంతి మూవీస్ స‌మ‌ర్ప‌ణ‌లో స్వ‌ప్న సినిమాస్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. దుల్కార్ ఇంత‌కుముందు ఇదే బ్యాన‌ర్ తెర‌కెక్కించిన మ‌హాన‌టి చిత్రంలో న‌టించిన సంగ‌తి తెలిసిందే.