Begin typing your search above and press return to search.

'సీతా రామం' స్టార్‌ అప్‌ కమింగ్ మూవీ ఇంట్రెస్టింగ్‌ అప్డేట్‌

By:  Tupaki Desk   |   30 May 2023 3:00 PM GMT
సీతా రామం స్టార్‌ అప్‌ కమింగ్ మూవీ ఇంట్రెస్టింగ్‌ అప్డేట్‌
X
మహానటి.. సీతా రామం వంటి సినిమాలతో తెలుగు లో ఫ్యాన్‌ ఫాలోయింగ్ దక్కించుకున్న మలయాళ స్టార్‌ హీరో దుల్కర్‌ సల్మాన్‌. త్వరలో ఒక తెలుగు దర్శకుడితో దుల్కర్ సినిమా చేయబోతున్నట్లుగా ఇప్పటికే వార్తలు వస్తున్నాయి. విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం దుల్కర్ తాజా చిత్రం కింగ్ ఆఫ్ కొత్త షూటింగ్‌ దాదాపుగా పూర్తి అయ్యింది.

పాన్ ఇండియన్ గ్యాంగ్ స్టర్ డ్రామా కింగ్‌ ఆఫ్ కొత్త 150 రోజుల పాటు షూటింగ్ సాగిందని... ఎట్టకేలకు భారీ షెడ్యూల్ ను ముగించారని తెలుస్తోంది. చిన్న చిన్న ప్యాచ్ వర్క్‌ మినహా షూటింగ్‌ పూర్తి అయ్యిందని... మరో వైపు సినిమా యొక్క పోస్ట్‌ ప్రొడక్షన్ వర్క్‌ ను చేస్తున్నట్లుగా తెలుస్తోంది.

ఈ భారీ గ్యాంగ్‌ స్టర్‌ సినిమాకు గాను అభిలాష్ జోషి దర్శకత్వం వహిస్తున్నాడు. తెలుగు లో ఈ సినిమాను భారీ ఎత్తున విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు.

ఇటీవల హిందీలో కూడా దుల్కర్ సల్మాన్ ఒక సినిమా తో మెప్పించాడు. కనుక కింగ్‌ ఆఫ్ కొత్త సినిమాను హిందీలో కూడా భారీ గా విడుదల చేసే ప్లాన్‌ చేస్తున్నారు.

కింగ్‌ ఆఫ్ కొత్త సినిమా తర్వాత సితార ఎంటర్‌ టైన్‌మెంట్స్ బ్యానర్‌ లో వెంకీ అట్లూరి దర్శకత్వంలో ఒక సినిమాను దుల్కర్ సల్మాన్‌ చేయబోతున్న విషయం తెల్సిందే.

ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది. సార్ సినిమా తర్వాత వెంకీ అట్లూరి దర్శకత్వంలో రాబోతున్న సినిమా అవ్వడం తో అంచనాలు భారీగా ఉండే అవకాశాలు ఉన్నాయి.