అమ్మడిని ఏడుపు మొహం అంటూ ఆటపట్టిస్తున్నాడా?

Thu Oct 29 2020 11:15:20 GMT+0530 (IST)

Dulquer Birthday Wishes To Aditi Rao

ఏకకాలంలో సౌత్ నార్త్ రెండు చోట్లా హవా సాగిస్తోంది అదితీరావ్ హైదరీ. ముఖ్యంగా మణిరత్నం లాంటి స్టార్ డైరెక్టర్ వద్ద ఆస్థాన నాయికగా సెటిలైపోయిన అదితీకి అటు హిందీ బెల్ట్ లోనూ ఇటు తెలుగు తమిళం మలయాళంలోనూ మంచి గుర్తింపు దక్కుతోంది.ఓవైపు తెలుగులో నటిస్తూనే మరోవైపు మలయాళ పరిశ్రమను ఈ అమ్మడు అస్సలు విడిచిపెట్టడం లేదు. కేవలం గ్లామర్ ఎలివేషన్ కి సంబంధించిన పాత్రలే కాదు.. నటనలో నిరూపించుకునేందుకు ఆస్కారం ఉన్న పాత్రలతోనే మురిపిస్తోంది అదితీ. ఇక ఇటు తెలుగు స్టార్లు సహా అటు మలయాళ స్టార్లతోనూ ఈ అమ్మడు మంచి స్నేహ సంబంధాలు కొనసాగిస్తోంది.

మాలీవుడ్ యంగ్ హీరో దుల్కార్ సల్మాన్ కి అదితీ మరీ టూమచ్ గా క్లోజ్ అయిపోతోందన్న గుసగుసలు ఇటీవల వినిపించాయి. అయితే ఈలోగానే దానికి ఇది ప్రూఫ్ అనుకోవాలా? అంటూ ఓ ఫోటోని అభిమానులు వైరల్ చేస్తున్నారు. ఇదిగో మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ తన బెస్ట్ బడ్డీ అదితి రావు హైదరీకి పుట్టినరోజు శుభాకాంక్షలు చెబుతూ అదిరిపోయే ఫోజును షేర్ చేశారు. ‘హే సినామికా’ సెట్స్ లో దిగిన ఫోటో ఇది. దుల్కార్ చిరునవ్వులు చిందిస్తుంటే అదితీ మాత్రం అలాంటి ఎక్స్ ప్రెషన్స్ ఇచ్చిందేమిటో! అదితీ ఏడుపు మొహం అంటూ ఆటపట్టిస్తున్నాడా? ఏమో.. దుల్కార్ చెప్పాలి మరి. ‘# క్రైబాబీ’ అంటూ వ్యాఖ్యను దుల్కార్ జోడించాడు !!

దుల్కర్ -అదితి రావు హైదారి రాబోయే తమిళ చిత్రం హే సినామికాలో జంటగా నటించారు. ఈ చిత్రం దక్షిణాది కొరియోగ్రాఫర్ బిర్ందా గోపాల్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో కాజల్ కీలక పాత్రలో నటిస్తున్నారు.