నారప్పను మరవక ముందే రాంబాబు వచ్చేస్తున్నాడు

Sun Jul 25 2021 15:42:24 GMT+0530 (IST)

Venkatesh Back to Back with Narappa and Drushyam 2

వెంకటేష్ బ్యాక్ టు బ్యాక్ నారప్ప మరియు దృశ్యం 2 చిత్రాలతో వస్తాడని కొన్ని నెలలుగా ప్రేక్షకులు ఎదురు చూస్తున్నారు. థియేటర్లు కరోనా వల్ల మూసి ఉండటంతో పాటు ఓపెన్ అయినా జనాలు వస్తారో లేదో తెలియని కారణంగా సినిమాలను ఓటీటీ ద్వారా విడుదల చేసేందుకు సిద్దం అయ్యారు. ఇటీవలే నారప్ప సినిమా తో వెంకీ ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. నారప్ప సినిమా లో వెంకటేష్ నటనకు మంచి మార్కులు పడ్డాయి. ఒరిజినల్ వర్షన్ అసురన్ కంటే నారప్ప సినిమా అద్బుతంగా ఉంది అంటూ కామెంట్స్ వస్తున్నాయి. నారప్ప సినిమా గురించి ఇంకా సోషల్ మీడియాలో చర్చ జరుగుతూనే ఉంది. ఆయన గురించి మాట్లాడుకుంటూ ఉన్న ఈ సమయంలోనే మరో సినిమాను వెంకటేష్ ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేందుకు సిద్దం అయ్యాడు.ఇప్పటికే విడుదలకు సిద్దం అయిన దృశ్యం 2 ను హాట్ స్టార్ ద్వారా విడుదల చేసేందుకు ఒప్పందం కుదిరింది. భారీ మొత్తానికి దృశ్యం 2 సినిమా ను హాట్ స్టార్ వారు కొనుగోలు చేశారట. నారప్ప సినిమా బిజినెస్ జరిగిన సమయంలోనే దృశ్యం 2 ను కూడా డీల్ ముగించారు. అయితే నారప్ప విడుదల తర్వాత కాస్త గ్యాప్ ఉండాలనే ఉద్దేశ్యంతో దృశ్యం 2 ను కాస్త లేట్ గా విడుదల చేయాలని భావించారు. సినీ వర్గాల ద్వారా అందుతున్న సమాచారం ప్రకారం నారప్ప సినిమా ను సెప్టెంబర్ లో ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేందుకు సిద్దం అవుతున్నారు.

టాలీవుడ్ వర్గాల ద్వారా అందుతున్న సమాచారం ప్రకారం దృశ్యం 2 సినిమాను సెప్టెంబర్ 9 లేదా 10వ తారీకున స్ట్రీమింగ్ మొదలు పెట్టే అవకాశాలు ఉన్నాయి. దృశ్యం 2 మలయాళంలో సూపర్ హిట్ అయిన నేపథ్యంలో తెలుగు ప్రేక్షకుల్లో కూడా ఈ సినిమా భారీ అంచనాలను కలిగి ఉంది. మీనా ఈ సినిమా లో వెంకటేష్ కు జోడీగా నటించింది. దృశ్యం లో నటించిన వారే ఈ సీక్వెల్ లో కూడా కంటిన్యూ అయ్యారు. అయితే దర్శకత్వం మాత్రం ఒరిజినల్ వర్షన్ కు చేసిన జీతూ జోసెఫ్ కంటిన్యూ అయ్యాడు. కేవలం రెండు నెలల్లోనే ఈ సినిమాను ముగించినట్లుగా సమాచారం అందుతోంది.