Begin typing your search above and press return to search.

డ్రగ్ కేసు : NCB విచారణకు హాజరైన దీపికా...!

By:  Tupaki Desk   |   26 Sep 2020 5:45 AM GMT
డ్రగ్ కేసు : NCB విచారణకు హాజరైన దీపికా...!
X
బాలీవుడ్ డ్రగ్ సంబంధాలపై స్టార్ హీరోయిన్ దీపికా పదుకునే కి నార్కోటిక్స్‌ కంట్రోల్‌ బ్యూరో(ఎన్‌సీబీ) సమన్లు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో దీపికా పడుకునే నేడు విచారణకు హాజరు కావాలని ఎన్సీబీ నోటీసుల్లో పేర్కొనగా.. తాజాగా దీపికా ఎన్సీబీ విచారణకు హాజరు అయింది. ఉదయం 9.48 నిమిషాలకు ఆమె ముంబైలోని ఎన్సీబీ కార్యాలయానికి చేరుకున్నారు. దీపికా ఆమె మేనేజరు కరిష్మా ప్రకాష్ మరియు క్వాన్ టాలెంట్ మేనేజర్ జయ సాహాలతో జరిపిన వాట్సాప్ ఛాట్ ఆధారంగా దీపికాకు సమన్లు జారీ చేశారు. ఇప్పటికే ఈ కేసులో కరిష్మా ప్రకాష్ ని విచారించిన ఎన్సీబీ.. నేడు(శనివారం) కూడా విచారణకు రావాలని ఆదేశించారని తెలుస్తోంది.

కాగా, 2017లో దీపికా ఆమె మేనేజరు కరిష్మా ప్రకాష్ మరియు క్వాన్ టాలెంట్ మేనేజర్ జయ సాహాలతో జరిపిన వాట్సాప్ ఛాట్ లో నిషేధిత 'మాల్' 'హ్యాష్' గురించి డిస్కస్ బయటపడటంతో వీరికి డ్రగ్స్ తో ఉన్న సంబంధాలను విచారించునున్నారు. ఇప్పటికే ఈ కేసులో హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ ని 4 గంటల పాటు ప్రశ్నించగా పలు కీలక విషయాలు వెల్లడించినట్లు నేషనల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఈ క్రమంలో ధర్మ ప్రొడక్షన్స్‌ ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌ క్షితిజ్‌ రవి ప్రసాద్ ని కూడా ఎన్సీబీ అధికారులు ప్రశ్నించారు. ఇక క్షితిజ్‌ ఇంట్లో సోదాలు నిర్వహించగా డ్రగ్స్ లభించినట్లు తెలుస్తోంది.

ఈ నేపథ్యంలో ధర్మ ప్రొడక్షన్స్‌ అధినేత కరణ్ జోహార్ గతంలో తన నివాసంలో నిర్వహించిన పార్టీలో డ్రగ్స్ సరఫరా చేసారని ఆరోపణలు వచ్చాయి. అయితే వీటిని ఖండిస్తూ కరణ్ ఓ లేఖ విడుదల చేశారు. ఎన్.సిబి విచారిస్తున్న క్షితిజ్ ప్రసాద్ మరియు అనుభవ్ చోప్రాలు తనకు వ్యక్తిగతంగా తెలియదని.. కొంతమంది వ్యక్తులు తమ వ్యక్తిగత జీవితంలో చేసే పనులకు అతను లేదా ధర్మ ప్రొడక్షన్స్ బాధ్యత వహించడం కుదరదని కరణ్ పేర్కొన్నారు.