'దృశ్యం-2' బాలీవుడ్ రీమేక్ రెడీ అవుతుందా..?

Tue Feb 23 2021 13:00:02 GMT+0530 (IST)

Drishyam 2 Bollywoodd Remake

ఇటీవల విడుదలైన ఇండియన్ సినిమాలలో ప్రస్తుతం ఎక్కువగా సినీ ఇండస్ట్రీల నోళ్లలో నానుతున్న సినిమా దృశ్యం-2. మలయాళంలో రూపొందిన ఈ సినిమా దేశవ్యాప్తంగా అన్ని భాషలవారిని ఆకట్టుకుంటుంది. సూపర్ స్టార్ మోహన్ లాల్ మీనా కలిసి నటించిన ఈ సస్పెన్స్ థ్రిల్లర్ మొదటి సినిమాకు సీక్వెల్ గా రూపొందింది. ఇటీవలే అమెజాన్ ప్రైమ్ లో విడుదలైన దృశ్యం-2 అటు ప్రేక్షకుల నుండి.. ఇటు క్రిటిక్స్ నుండి హిట్ టాక్ సొంతం చేసుకుంది. ఫస్ట్ పార్ట్ తెరకెక్కించిన జీతూ జోసెఫ్ సెకండ్ పార్ట్ కూడా రూపొందించాడు. అయితే దృశ్యం కంటే కూడా సీక్వెల్ దృశ్యం-2 భారీ సక్సెస్ కావడం మరింత జోష్ ఇస్తుందట. దృశ్యం సినిమా లాగే ఇప్పుడు దృశ్యం-2 సినిమా కూడా ఇతర భాషల్లోకి రీమేక్ అవుతోంది. ఇప్పటికే పలు భాషల రీమేక్ హక్కులను కూడా దక్కించుకున్నారట మేకర్స్.అయితే దృశ్యం సినిమా తెలుగులో బాలీవుడ్ లో కూడా అదేపేరుతో రీమేక్ అయిన సంగతి తెలిసిందే. తెలుగులో వెంకటేష్ మీనా ప్రధాన పాత్రలలో నటించిన దృశ్యం మంచి హిట్ అయింది. ఇప్పుడు మళ్లీ సీక్వెల్ కూడా ఉంటుందని ఇటీవలే వెంకటేష్ కన్ఫర్మ్ చేశారు. ఈసారి కూడా మరి మీనా ఉంటుందని టాక్. ఇదిలా ఉండగా.. దృశ్యం హిందీ రీమేక్ లో స్టార్ హీరో అజయ్ దేవగన్ శ్రీయశరన్ టబు ప్రధాన పాత్రలలో నటించారు. ఇప్పుడు బాలీవుడ్ లో కూడా దృశ్యం-2 తెరకెక్కనుంది. ఇప్పటికే బాలీవుడ్ రీమేక్ రైట్స్ అజయ్ దేవగణ్ ప్రొడ్యూసర్ కుమార్ మంగత్ కొనేశారని టాక్. ప్రస్తుతం అజయ్ దేవగన్ సినిమాల షూటింగ్స్ ముగియగానే ‘దృశ్యం-2’ సెట్స్ మీదకు వెళ్ళనుందని సమాచారం. అయితే ‘దృశ్యం’ సినిమాను  తెరకెక్కించిన డైరెక్టర్ నిశికాంత్ కామత్ 2019లో మరణించాడు. ఆయన స్థానంలో సుజయ్ ఘోష్ సీక్వెల్ సారథ్యం వహిస్తారని టాక్. కానీ ఇండస్ట్రీ వర్గాలు మాత్రం ఒరిజినల్ డైరెక్టర్ జీతూనే తెరకెక్కిస్తాడని అంటున్నాయి.