చిరు లూసీఫర్ కు ముందు మరోటి

Wed Aug 05 2020 12:40:38 GMT+0530 (IST)

Double Surprise For Chiru Birthday

మెగాస్టార్ చిరంజీవి బర్త్ డే కోసం మెగా ఫ్యాన్స్ ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఈనెల 22న పుట్టిన రోజు సందర్బంగా ‘ఆచార్య’ ఫస్ట్ లుక్ లేదా మేకింగ్ వీడియోను ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చే అవకాశం ఉందని ఇప్పటికే చిత్ర యూనిట్ సభ్యుల ద్వారా తెలుస్తోంది. ఆచార్య అప్ డేట్ తో పాటు లూసీఫర్ రీమేక్ కు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా చిరు బర్త్ డే సందర్బంగా వచ్చే అవకాశం ఉందని అనుకున్నారు. అయితే సుజీత్ రెడీ చేసిన రీమేక్ స్క్రిప్ట్ పై చిరంజీవి పెదవి విరిచాడంట. దాంతో లూసీఫర్ రీమేక్ ప్రాజెక్ట్ కాస్త ఆలస్యం అయ్యే అవకాశం ఉందంటున్నారు.ఆ రీమేక్ బాధ్యతలు మరో సీనియర్ దర్శకుడికి అప్పగించే యోచనలో ఉన్నట్లుగా తెలుస్తోంది. ఈసారి రీమేక్ కు సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ పూర్తి అయ్యి ఓకే అనుకున్న తర్వాతే దర్శకుడి పేరు బయటకు వచ్చేలా ప్లాన్ చేస్తున్నారట. ప్రస్తుత పరిణామాలు చూస్తుంటే లూసీఫర్ రీమేక్ కు సమయం పట్టేలా ఉంది. ఆ గ్యాప్ లో మరో సినిమాను చిరంజీవి చేస్తాడంటున్నారు. కొన్ని రోజుల క్రితం దర్శకుడు బాబీ చిరంజీవికి ఒక కథ చెప్పారంటూ వార్తలు వచ్చాయి.

చిరు బర్త్ డే సందర్బంగా బాబీ సినిమాను అనౌన్స్ చేసే అవకాశాలున్నాయంటూ వార్తలు వస్తున్నాయి. జై లవకుశ మరియు వెంకీ మామ చిత్రాలతో ఆకట్టుకున్న బాబీ విభిన్నమైన ఒక స్క్రిప్ట్ ను చిరంజీవికి వినిపించగా ఓకే చెప్పాడట. వచ్చే ఏడాది సమ్మర్ లో ఈ సినిమాను పట్టాలెక్కించే అవకాశం ఉందంటున్నారు. యంగ్ దర్శకులతో సినిమాలు చేయాలనుకుంటున్న చిరంజీవి ఇప్పటికే పలువురు యంగ్ డైరెక్టర్స్ చెప్పిన కథలు విన్న చిరు బాబీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడంటున్నారు.