చిరు బర్త్ డేకు డబుల్ సర్ ప్రైజ్ ?

Tue Aug 04 2020 11:15:37 GMT+0530 (IST)

Double Surprise For Chiru Birthday

మెగాస్టార్ చిరంజీవి పుట్టిన రోజు కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. చిరు బర్త్ డే అయిన ఆగస్టు 22వ తారీకున ఆచార్య ఫస్ట్ లుక్ లేదా మరేదైనా సర్ ప్రైజ్ ను చిత్ర యూనిట్ సభ్యులు ఇచ్చే అవకాశం ఉందని ఇప్పటికే అనధికారికంగా సమాచారం అందుతోంది. ఆచార్య చిత్రం అన్ని అనుకున్నట్లుగా జరిగితే ఈ ఆగస్టులో విడుదల అయ్యేది. కాని కరోనా వల్ల సినిమా వచ్చే ఏడాదికి వాయిదా పడినది. ఫ్యాన్స్ ను నిరుత్సాహ పర్చకూడదనే ఉద్దేశ్యంతో కొరటాల శివ ఆచార్య సర్ ప్రైజ్ ను ప్లాన్ చేస్తున్నాడట.ఆచార్య సర్ ప్రైజ్ తో పాటు మెగా ఫ్యాన్స్ మరో సర్ ప్రైజ్ కూడా రెడీ అవుతున్నట్లుగా మెగా వర్గాల ద్వారా తెలుస్తోంది. ఆచార్య చిత్రం పూర్తి అయిన వెంటనే చిరంజీవి మలయాళ సూపర్ హిట్ మూవీ ‘లూసీఫర్’ ను రీమేక్ చేయబోతున్న విషయం తెల్సిందే. ప్రముఖ నిర్మాత ఇప్పటికే ఆ రీమేక్ రైట్స్ ను దక్కించుకున్నాడు. చిరంజీవి నటించబోతున్న ఆ చిత్ర నిర్మాణంలో చరణ్ కూడా భాగస్వామిగా ఉండే అవకాశం ఉందంటున్నారు. ఆ సినిమాకు మొన్నటి వరకు సుజీత్ దర్శకత్వం వహిస్తాడని ప్రచారం జరిగింది. కాని సుజీత్ కాకుండా మరో దర్శకుడికి ఆ బాధ్యతలు అప్పగించినట్లుగా వార్తలు వస్తున్నాయి.

చిరు బర్త్ డే సందర్బంగా లూసీఫర్ కు సంబంధించిన ఏదైనా సర్ ప్రైజ్ ఇవ్వాలని మేకర్స్ భావిస్తున్నారట. అందుకోసం చిరంజీవిపై ఫొటో షూట్ ను కూడా చేశారనే సమాచారం అందుతోంది. లూసీఫర్ అధికారిక ప్రకటనతో పాటు దర్శకుడి విషయంలో క్లారిటీ ఇచ్చే అవకాశం ఉంది. ఇదే సమయంలో లూసీఫర్ లో కీలక పాత్ర పోషించిన మంజు వారియర్ పాత్రను తెలుగులో ఎవరు పోషించే విషయంలో కూడా చిరు బర్త్ డే రోజ క్లారిటీ ఇచ్చే అవకాశం ఉందంటున్నారు. మొత్తానికి చిరంజీవి బర్త్ డే రోజు రెండు సినిమాలకు సంబంధించిన సర్ ప్రైజ్ లను మెగా ఫ్యాన్స్ కోసం రెడీ అవుతున్నాయట.