Begin typing your search above and press return to search.

బ‌న్నీ ట్వీట్స్‌ తో `భీష్మ‌`కు డ‌బుల్ జోష్‌!

By:  Tupaki Desk   |   24 Feb 2020 7:45 AM GMT
బ‌న్నీ ట్వీట్స్‌ తో `భీష్మ‌`కు డ‌బుల్ జోష్‌!
X
నితిన్ - ర‌ష్మిక‌లు జంట‌గా న‌టించిన `భీష్మ‌` హిట్ టాక్‌ తో దూసుకుపోతోంది. నితిన్ కెరీర్‌ లోనే బిగ్గెస్ట్ హిట్‌ గా ఈ చిత్రం నిలుస్తుంద‌ని ట్రేడ్ వ‌ర్గాలు అంచ‌నా వేస్తున్నాయి. ఆ అంచ‌నాల‌కు త‌గ్గ‌ట్లుగానే `భీష్మ` వ‌సూళ్లు కూడా ఉన్నాయి. ఇప్ప‌ట్లో ఈ సినిమాకు పోటీగా నిలిచే పెద్ద సినిమాలేవీ లేక‌ పోవ‌డంతో ఫుల్ ర‌న్‌ లో `భీష్మ‌` 50 కోట్లు వ‌సూలు చేస్తుంద‌ని అంచ‌నా. `భీష్మ‌`కు ముందు ఎంగేజ్‌ మెంట్ రూపంలో జోష్‌ లో ఉన్న నితిన్...`భీష్మ‌` విజ‌యం సాధించ‌డంతో మ‌రింత జోష్‌ లో ఉన్నాడు. ఈ నేప‌థ్యంలోనే నితిన్ పెళ్లి వేడుకలు డ‌బుల్ జోష్‌ లో జ‌ర‌గాలంటూ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ట్వీట్ చేశాడు. 'భీష్మ` టీమ్ మొత్తానికి కంగ్రాట్స్ చెబుతూ బ‌న్నీ చేసిన ట్వీట్స్ సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అయ్యాయి.

యంగ్ హీరో నితిన్‌ కు బ‌న్నీ చెప్పిన హార్ట్‌ ఫుల్ విషెస్...నెటిజ‌న్ల‌ను ఇంప్రెస్ చేశారు. త‌న సినిమా` అల వైకుంఠ‌పుర‌ములో`కు పోటీగా విడుద‌లైన `స‌రిలేరు నీకెవ్వ‌రు`కు ప్రీ రిలీజ్ ఈవెంట్‌ లో ఆల్ ది బెస్ట్ చెప్పిన బ‌న్నీపై నెటిజ‌న్లు ప్ర‌శంస‌లు కురిపించిన సంగ‌తి తెలిసిందే. ఇపుడు తాజాగా నితిన్‌ కు బ‌న్నీ చెప్పిన క్యూట్ విషెస్ ...ఇద్ద‌రు హీరోల ఫ్యాన్స్‌ ను మెస్మ‌రైజ్ చేస్తున్నాయి. "డబుల్ కంగ్రాచ్యులేషన్స్ నితిన్. ఇక నీ పెళ్లి వేడుకలు డబుల్ జోష్ లో సాగుతాయి. మంచి టైమ్ వస్తే - అంతా మంచిగానే జరుగుతుంది. నీకు అంతా మంచే జరగాలి. 'భీష్మ' టీమ్ మొత్తాన్నీ నేను అభినందిస్తున్నా" అని బ‌న్నీ ట్వీట్ చేశాడు.

ఓ మంచి కమర్షియల్ ఎమోషనల్ ఎంటర్ టెయినర్ ను అందించినందుకు డైరెక్టర్ వెంకీని కూడా బ‌న్నీ అభినందించాడు. రష్మికతోపాటు త‌న నిర్మాత వంశీకి శుభాకాంక్షలు చెప్పిన బ‌న్నీ.... 2020 జనవరి - ఫిబ్రవరి వారిద్ద‌రికీ గొప్ప విజ‌యాన్నందించింద‌ని ట్వీట్ చేశాడు.