జీవితంలో అందమైనవేవీ కోల్పోవద్దు!- సారా అలీఖాన్

Tue Nov 29 2022 07:00:01 GMT+0530 (India Standard Time)

Dont miss out on anything beautiful in life Sara Ali Khan

పటౌడీ సంస్థాన వారసురాలు.. యువకథానాయిక సారా అలీ ఖాన్ తరచుగా తన అభిమానులు.. సోషల్ మీడియా ఫాలోవర్స్ కోసం ప్రతిసారీ ప్రయాణ లక్ష్యాలను నిర్దేశిస్తుంది. సారా ఇటీవల బీచ్ నుండి బికినీ ధరించిన ఓ అందమైన ఫోటోని షేర్ చేయగా అది వైరల్ గా మారింది. ఈ ఫోటోలో సైకిల్ పై కూర్చొని ఫ్లోరల్ బికినీని ధరించి కనిపించింది.



సారా అలీ ఖాన్ హాట్ బీచ్ వేర్ హీట్ పుట్టిస్తోంది. నిజానికి బికినీ బీచ్ సెలబ్రేషన్స్ లో సారా ఒక ట్రెండ్ సెట్టర్ అని చెప్పాలి. నేటితరం కథానాయికల్లో జాన్వీ - కియరా- అనన్య లాంటి భామలకు ధీటుగా అందాల ఆరబోతతో ఆకర్షిస్తున్న ఈ బ్యూటీ తాజాగా తన లేటెస్ట్ వెకేషన్ నుంచి హాటెస్ట్ ఫోటోని అభిమానుల కోసం షేర్ చేసింది. ఈ కొత్త పోస్టింగ్ యూత్ కి ప్రధాన వెకేషన్ గోల్స్ ని సెట్ చేస్తోంది.

వాటర్ బేబీగా ఇప్పటికే కుర్రకారు హార్ట్ బీట్ గా మారిన సారా తరచూ తన పూల్ సైడ్ ఫోటోలు వీడియోలను షేర్ చేస్తూ ఇన్ స్టాలో భారీ ఫాలోవర్స్ ని పెంచుకుంది. తాజాగా సెక్సీ ఫ్లోరల్ బికినీ లో అన్ నోన్ బీచ్ వెకేషన్ నుంచి ఫోటోను షేర్ చేసింది. సారా ఫ్లోరల్ బికినీ వందశాతం తన బాడీకి యాప్ట్. ఇది కుర్రకారుకు కంటికి కునుకుపట్టనివ్వని ట్రీట్ అంటే అతిశయోక్తి కాదు. అయితే ఈ ఫోజ్ కొందరికి నచ్చలేదు. నెటిజనులు `కుచ్ తో శర్మ కర్లో` అని కూడా కామెంట్ చేసారు.

అయితే ఇలాంటి అందమైన శరీరాకృతి ఎలా సాధ్యం? అంటే సారా అందం ఆరోగ్యం వెనక అసలు రహస్యాన్ని తెలుసుకుని తీరాలి. సారా ఫిట్ నెస్ ఔత్సాహికురాలు. క్రమశిక్షణతో కూడిన జీవితాన్ని లీడ్ చేస్తోంది. క్రమం తప్పకుండా వ్యాయామం చేస్తుంది. ఆహార నియమాలను అనుసరిస్తుంది. జిమ్- యోగా సెషన్స్ కి అస్సలు స్కిప్ కొట్టదు.

సారా ఇంతకుముందే గోవాలోని IFFI (ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా) నుండి వరుణ్ ధావన్ తో బీచ్ సెల్ఫీని షేర్ చేసింది. అక్కడ రెడ్ హాట్ బికినీని ధరించింది. ఇప్పుడు ఫ్లోరల్ బికినీతో మరోసారి దుమ్ము లేపింది. సారా పొడవాటి పూల రంగు ష్రగ్ బికినీ ధరించి ఆ ఫోటోకి ఇలా క్యాప్షన్ ఇచ్చింది. ``మీ ఒడ్డున మీరు ఉండండి. మీ షెల్ నుండి బయటకు రండి. తీరానికి సమయం కేటాయించండి. అంతులేని ఒత్తిడిని నివారించండి. సముద్ర తీర జీవితం అందంతో కూడుకున్నది. జీవితంలోని అందమైన వేవ్స్ ని కోల్పోయేంతగా పనిలో ఆటుపోట్లు ఎదుర్కోకండి. ప్రతిదీ ఆస్వాధించండి`` అంటూ అందమైన కోట్ ని షేర్ చేసింది.  

సారా కొన్ని పరాజయాల నుంచి నేర్చుకుని విజయాల బాటలోకి వస్తోంది. తదుపరి విక్కీ కౌశల్ తో లక్ష్మణ్ ఉటేకర్ చిత్రంలో కనిపించనుంది. నటనకు ఆస్కారం ఉన్న పాత్రలను తెలివిగా ఎంపిక చేసుకుంటోంది. మరోవైపు స్టార్ హీరోల సరసన గ్లామరస్ పాత్రల్లోను నటిస్తోంది. కెరీర్ ని అన్నివిధాలా బ్యాలెన్స్ చేస్తోంది. సింపుల్ చిరునవ్వుతో ఎదుటివారిని అంతే తెలివిగా మ్యానేజ్ చేసేస్తోంది.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.